amp pages | Sakshi

మైనింగ్‌ శాఖలో సంస్కరణలపై సీఎం జగన్‌ సమీక్ష

Published on Wed, 05/19/2021 - 20:41

అమరావతి: మైనింగ్‌ శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. మైనింగ్‌ శాఖలో సంస్కరణలపై చర్చించారు. ఈ– ఆక్షన్‌ ద్వారా మైనర్‌ మినరల్స్‌ అమ్మాలని.. సీనరేజీ ఫీజు వసూలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించాలని అధికారులు సీఎం జగన్‌కు సూచించారు. గ్రానైట్‌ మైనింగ్‌లో సైజు (పరిమాణం) పద్దతిలో కాకుండా బరువు ఆధారంగా సీనరేజీ నిర్ణయించాలని తెలిపారు. ఇకపై ఎన్ని టన్నులు బరువు ఉంటే.. ఆమేరకు సీనరేజీ ఫీజు వసూలు చేయాలని అధికారులు తెలిపారు. దీనివల్ల కనీసం 35 నుంచి 40శాతం ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. 

లీజులు పొంది, గనులు నిర్వహించని చోట కొత్తగా ఈ వేలం నిర్వహించాలని.. దీని వల్ల ప్రభుత్వానికి మరో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచాన వేశారు. ఈ నిర్ణయాలకు సీఎం ఆమోదం తెలిపారు. సెప్టెంబరు నుంచి కొత్త నిర్ణయాలు అమల్లోకి  వస్తాయన్నారు అధికారులు. మైనింగ్‌ శాఖలో నిఘా, అమలు విభాగం పటిష్టంగా ఉండాలని.. ఆదాయాలకు గండి పడకుండా చూడాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 

వర్షాలు వచ్చేలోగా కనీసం 60 నుంచి 79 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుకను అందుబాటులోకి ఉంచాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వర్షాలు వల్ల రీచ్‌లు మునిగిపోయే అవకాశం ఉంటుంది. మళ్లీ ఇసుకకు ఇబ్బందులు రాకూడదు అన్నారు. అందుకనే సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 

ఈ సమావేశానికి పంచాయతీరాజ్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మైనింగ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, భూగర్భగనుల శాఖ డైరెక్టర్‌ (డిఎంజి) విజి.వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

చదవండి: మానవత్వాన్ని చాటుకున్న మంత్రి పెద్దిరెడ్డి

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)