Breaking News

వలంటీర్‌పై టీడీపీ కార్యకర్తల దాడి.. 

Published on Tue, 05/02/2023 - 07:53

వినుకొండ (నూజెండ్ల): ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నాడని కక్షగట్టిన టీడీపీ కార్యకర్తలు వలంటీర్‌పై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో అప్రమత్తంగా ఉండటంతో వలంటీర్‌ స్వల్ప గా­యా­లతో బయటపడ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండలో జరిగింది.

పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండ 5వ వార్డులో వలంటీర్‌ షేక్‌ అష్రాఫ్‌ æరాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీన్ని సహించలేని టీడీపీ కార్యకర్తలు సీఎంను కించపరుస్తూ పోస్టులు పెట్టారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదని వలంటీర్‌ అష్రాఫ్‌ టీడీపీ కార్యకర్తలకు సూచించాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు అతడితో సోషల్‌ మీడియాలోనే వాగ్వాదానికి దిగారు.  ఆదివారం రాత్రి వలంటీర్‌ అష్రాఫ్, అతడి మిత్రుడు ఇమ్రాన్‌ఖాన్‌ మసీదుకు వెళ్లి వస్తుండగా టీడీపీ కార్యకర్తలు.. ఇమ్రాన్, షఫీ, సిద్ధు, ఫారూఖ్, ఫరీద్, ఖాజాలు అష్రాఫ్‌æపై దాడికి దిగారు. షఫీ  కత్తితో దాడి చేయడంతో వలంటీర్‌కు  గాయాలయ్యాయి. అతడి మిత్రులు అష్రాఫ్‌ను వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)