amp pages | Sakshi

టీడీపీ స్కెచ్‌.. ‘నీ పంట దున్నెయ్‌.. లీడర్‌ని చేస్తాం..’

Published on Fri, 02/17/2023 - 05:54

శ్రీకాళహస్తి: తన పంటను తానే ధ్వంసం చేసుకుని వైఎస్సార్‌సీపీ వారిపైకి నెట్టిన టీడీపీ కార్యకర్త బాగోతం బట్టబయలైంది. పోలీసుల విచారణలో తెలుగుదేశం నేతల కుట్ర బయటపడింది. లోకేశ్‌ పాదయాత్ర తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం మీదుగా సాగనుండడంతో దానికి ప్రచారం తీసుకురావాలని టీడీపీ నేతలు కుట్రకు తెరతీశారు. అందుకు పార్టీ కార్యకర్త మురళీకృష్ణారెడ్డిని పావుగా చేసుకున్నారు.

మండలంలోని చిట్టత్తూరు గ్రామానికి చెందిన మురళీకృష్ణారెడ్డి 4.25 ఎకరాల విస్తీర్ణంలో వేరుశనగ సాగుచేశాడు. ‘నీ పంటను నువ్వే ధ్వంసం చేసి దాన్ని వైఎస్సార్‌సీపీ వారు చేశారని ప్రచారం చెయ్యి. పాదయాత్రలో లోకేశ్‌ను మీ ఇంటికి తీసుకొస్తాం. నీకు నష్టపరిహారం ఇప్పించి, మంచి లీడర్‌ని చేస్తాం..’ అంటూ మురళీకృష్ణారెడ్డికి చెప్పారు. దీంతో మురళీకృష్ణారెడ్డి, డ్రైవర్‌ మధు ఈనెల 9న (గురువారం) రాత్రి రోటావేటర్‌తో వేరుశనగ పంటను ధ్వంసం చేశారు.

శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి తన పంటను వైఎస్సార్‌సీపీ నాయకులు నాశనం చేశారంటూ మురళీకృష్ణారెడ్డి గగ్గోలు పెట్టారు. పథకం ప్రకారం టీడీపీ నేతలంతా గ్రామంలో పర్యటించి వైఎస్సార్‌సీపీ నాయకులపైన, ప్రభుత్వంపైన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్‌ డేటా, సీసీ ఫుటేజీలు పరిశీలించి మురళీకృష్ణారెడ్డిని, మధుని విచారించారు.

తన పంటను తానే ధ్వంసం చేసుకున్నట్లు మురళీకృష్ణారెడ్డి అంగీకరించారని సీఐ విక్ర­మ్‌ తెలిపారు. ఈ విషయంపై విలేకరులు డ్రైవర్‌ మధుని అడగగా.. పంట ధ్వంసం  వెనుక రాజకీయాలు తనకు తెలియదని చెప్పాడు. పంట సరిగా రాలేదని, ధ్వంసం చేస్తే ఇన్సూరెన్స్‌ వస్తుందని చెప్పడంతోనే రోటావేటర్‌తో దున్నేశానని స్పష్టం చేశాడు. దీంతో టీడీపీ కుట్ర బహిర్గతమైంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)