amp pages | Sakshi

ఆ రాయి ఎలా వచ్చింది?

Published on Wed, 04/14/2021 - 03:07

సాక్షి, తిరుపతి: చంద్రబాబు సభలో రాళ్ల దాడి వ్యవహారంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. చంద్రబాబు సభ మొత్తం సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. రాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు సీసీ ఫుటేజీ పరిశీలించగా, సభలో ఎక్కడా రాళ్లు పడినట్టు కనపడలేదనని డీఐజీ కాంతిరాణ టాటా వెల్లడించారు. గాయపడ్డారని చెబుతున్న వారి స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డ్‌ చేశారు. సదరు వ్యక్తులు పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబు చూపిన రాయి అసలు ఆ ప్రాంతంలో ఉన్నది కాదని నిర్ధారణ అయ్యింది. అయితే ఆ రాయి సభలోకి ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

చంద్రబాబు కట్టు కథే
తిరుపతిలో సోమవారం సాయంత్రం 5.40 నుంచి రాత్రి 7 గంటల వరకు చంద్రబాబు రోడ్డు షో నిర్వహించి కృష్ణాపురం ఠాణా వద్ద స్థానికుల నుద్దేశించి ప్రసంగించారు. ఉప ఎన్నికలో డిపాజిట్లయినా వస్తాయో లేదోననే ఆందోళనతో ఓ కార్యకర్తపై రాయి పడిందంటూ అప్పటికప్పుడు సభలో చంద్రబాబు ఒక కట్టుకథ అల్లారు. అది నిజమని నమ్మించేందుకు అక్కడే బైఠాయించి హంగామా సృష్టించారు. జాతీయ మీడియాని రప్పించి ఏపీలో ఏదో జరిగిపోతోందంటూ పారా మిలటరీ బలగాలతో ఎన్నికలు జరిపించాలని కొత్త డిమాండ్‌తో నాటకాన్ని మరింత రక్తి కట్టించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు టీడీపీ నేతల్ని పంపి తనపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేయించారు. ఇంతా చేస్తే.. రాయి ఎవరికి తగిలిందో.. ఎవరికేం అయిందో చెప్పలేదు. తనను టార్గెట్‌ చేసుకుని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాళ్ల దాడి చేయించిందని ఆరోపణలు చేశారు. అయితే ఈ ఘటనతో తమకు ఏమాత్రం సంబంధం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తేల్చి చెప్పారు. టీడీపీకి మద్దతిచ్చే ఎల్లో మీడియా కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చంద్రబాబు సభలో రాళ్లు వేశారని ఎక్కడా చెప్పలేదు. చంద్రబాబు వాహనంపై నుంచి మట్లాడుతున్న సమయంలో పై నుండి ఒకరాయి వచ్చి పడిందని మాత్రమే చెప్పింది. 

ఇది హైడ్రామా కాదా?
ఎవరో కార్యకర్తపై రాయి వేశారని, ఆ రాయిని తెప్పించుకుని అందరికీ చూపించి తనపైనే రాళ్లదాడి జరిగినట్లుగా చంద్రబాబు సీన్‌ క్రియేట్‌ చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయం వద్దకు నడిచి వెళ్లటం.. అక్కడ సీఎం వైఎస్‌ జగన్‌కు వార్నింగ్‌లు ఇవ్వడం చూస్తుంటే ముమ్మాటికీ ఇది చంద్రబాబు హైడ్రామానే అని స్పష్టం అవుతోందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుపై రాళ్ల దాడి చేయాల్సినంత అవసరం ఎవరికుంది? తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో టీడీపీకి గెలుపు అవకాశాలు దాదాపుగా లేవని, ఈ నేపథ్యంలో  రాళ్లదాడి చేయించాల్సిన అవసరమైతే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అసలే లేదని అందరికీ తెలుసు. ఈ దృష్ట్యా ఉప ఎన్నికల్లో ద్వితీయ స్థానం కోసం చంద్రబాబు పాట్లు పడుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో భాగంగానే రాళ్ల దాడి నాటకానికి తెర తీశారని, తద్వారా ప్రజలు జాలి కురిపించి ఓట్లు వేస్తారన్నది ఆయన ఆశ అంటున్నారు. ఎవరైనా రాళ్లు వేస్తుంటే నిఘా విభాగాల సంగతి అటుంచితే, టీడీపీ కార్యకర్తలు ఒక్కరైనా సెల్‌లో బంధించే వారు కదా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ప్లాన్‌ మేరకు టీడీపీ కార్యకర్తలే ఆ రాళ్లు జేబులో పెట్టుకుని, తీసుకువచ్చి చంద్రబాబు చేతికి ఇచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబుపై పూలు చల్లే క్రమంలో అందులో పొరపాటున రాయి ఉండి ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు. 

రాళ్ల దాడి జరిగినట్లు ఆధారాలు లేవు
చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగినట్లు ఆధారాలు లేవు. ప్రచారంలో ఎక్కడా అంతరాయం జరగలేదని సెక్యూరిటీ సిబ్బంది కూడా స్పష్టం చేశారు. పోలీసులతో పాటు.. ఇంటలిజెన్స్‌ సెక్యూరిటీ, ఎన్‌ఎస్‌జీ, ఐఎస్‌డబ్లు్య సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. రాళ్ల దాడి విషయంపై సీసీ కెమెరాలు పరిశీలించాం. చంద్రబాబు పర్యటించిన ప్రాంత పరిధిలోని స్థానికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు సెక్యూరిటీ, సౌండ్‌ సిస్టమ్స్‌ సిబ్బంది, డ్రైవర్లు ఇలాఅందరినీ విచారించాం. పోలీసులపై నిందలు వేయటం తగదు. ఆధారాలు ఉంటే ఇవ్వండి. 
– కాంతిరాణ టాటా, డీఐజీ  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)