వైఎస్సార్‌ ఫొటో ఎందుకు పెట్టకూడదు: హైకోర్టు

Published on Mon, 08/31/2020 - 19:56

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై దివంగత ముఖ్యమం‍త్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫోటో పెట్టడంలో తప్పేముందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌ తండ్రి అని, ఆయన గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని న్యాయస్థానం గుర్తుచేసింది. ప్రభుత్వ ప్రకటనల్లో వైఎస్సార్‌ ఫోటోను తొలగించాలని కోరుతూ టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఆయన ఫోటోలను ఎందుకు పెట్టకూడదని, వైఎస్సార్‌ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా? అని వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యాన్ని తాము విచారించబోమని, రెగ్యులర్‌ బెంచ్‌ వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. పిటిషన్‌పై సోమవారం విచారణ సందర్భంగా అడ్వకేట్‌ జరనల్‌ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఇది పక్కా బినామీ పొలిటికల్‌ పిటిషన్‌ అని అన్నారు.

పిటిషన్‌ దాఖలు చేసిన వ్యక్తి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి చెందిన వ్యక్తి అని, ఆయన టీడీపీ సానుభూతి పరుడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ‘పిటిషనర్‌ టీడీపీతో విడదీయరాని అనుబంధం ఉన్న వ్యక్తి. టీడీపీతో రాజకీయ అనుబంధాన్ని ఇక్కడ తొక్కిపెడుతున్నారు. చంద్రబాబు హయాంలో పసుపురంగులో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చినప్పుడు ఈయనకు చాలా సుఖంగా ఉంది. టీడీపీ అధికారానికి దూరంకాగానే పాపం ఈయన అంతరాత్మ క్షోభిస్తోంది.’ అని వాదించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రచురించిన ప్రభుత్వ ప్రకటలను అడ్వకేట్‌ హైకోర్టుకు నివేదించారు. చంద్రబాబు, లోకేష్, నారాయణ, ఎన్టీఆర్‌ ఫొటోలు పెట్టారని తెలిపారు. మంత్రులు, ఇతర వ్యక్తుల ఫొటోలు ప్రకటనల్లో పెట్టుకోవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలోనే తీర్పునిచ్చినిందని గుర్తుచేశారు.

Videos

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!

కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు

జనంతో కిక్కిరిసిన మైదుకూరు

జగన్ గెలుపుకు అర్ధం..!

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయం

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ @మైదుకూరు

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)