AP: నేతన్నకు ఊతం.. ఆఫర్లతో ఆప్కోకు అందలం

Published on Sat, 01/22/2022 - 07:40

సాక్షి, అమరావతి: క్రిస్మస్, సంక్రాంతి పండుగ సీజన్లలో ప్రకటించిన ఆఫర్ల కారణంగా ఆప్కో వస్త్ర వ్యాపారం ఊపందుకుంది. పండుగ సీజన్లలో  అమ్మకాలు పెరగడమే ఇందుకు నిదర్శనం. పండుగ సీజన్లలో 30 శాతం డిస్కౌంట్‌పై ఆప్కో అమ్మకాలు సాగించడంతో ఆప్కో షోరూమ్‌ల ద్వారా గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఏకంగా రూ.9 కోట్లకుపైగా వస్త్ర విక్రయాలు జరిగాయి.

చదవండి: గుడివాడలో టీడీపీకి భంగపాటు

రాష్ట్రంలోని పలు సొసైటీల వద్ద పేరుకుపోయిన చేనేత వస్త్రాల నిల్వలను కరోనా కష్టకాలంలోనూ కొనుగోలు చేస్తున్న ఆప్కో లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు అందిస్తోంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లా చేనేత సహకార సొసైటీల్లో పేరుకుపోయిన రూ.కోటి 60 లక్షల విలువైన బెడ్‌షీట్‌లను ఆప్కో కొనుగోలు చేసి విక్రయాలు జరిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 108 ఆప్కో షోరూమ్‌లున్నాయి. వాటిలో నామ మాత్రపు విక్రయాలు జరిగే వాటిని తొలగించి  వ్యయప్రయాసలు తగ్గించేందుకు ఆప్కో సిద్ధమైంది. అయితే ఇటీవల ప్రారంభించిన గుంటూరు, ఒంగోలు, కడపలో రోజుకు రూ.లక్షకుపైగా అమ్మకాలు జరగడంతో రాష్ట్రంలో మరో పది మెగా షోరూమ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ