amp pages | Sakshi

ఏలూరు ఘటన: క్రమంగా తగ్గుతున్న కేసులు..

Published on Sun, 12/06/2020 - 15:57

సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య ఇప్పటివరకు 270కి చేరింది. అస్వస్థతకు గురైన బాధితులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఇప్పటివరకు 117 మందిని డిశ్చార్జ్‌ చేశామని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం పదిమందిని అధికారులు విజయవాడ తరలించారు. బాధితులకు వైద్యసిబ్బంది అలుపెరగకుండా సేవలు అందిస్తున్నారు. (చదవండి: భయపడవద్దు.. అండగా ఉంటాం: ఆళ్ల నాని)

లక్షణాలు కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. వైద్య బృందం.. ఇంటింటికి ఆరోగ్య సర్వే చేపట్టింది. టెస్టుల కోసం శాంపిల్స్‌ను అధికారులు వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఫిట్స్ లక్షణాలతో చేరిన బాధితులకు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో అదనపు బెడ్‌లు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంత్రి ఆళ్లనాని పర్యవేక్షణలో కలెక్టర్, అధికారులు చర్యలు చేపట్టారు. కంట్రోల్ రూమ్ ద్వారా కలెక్టర్‌.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. (చదవండి: ఏలూరు ఘటనపై సీఎం జగన్‌ ఆరా)

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సమీక్ష..
ఉదయం నుంచి క్రమంగా కేసులు తగ్గాయని మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్‌, డీఎంహెచ్‌వో, వైద్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతాల్లో 108 వాహనాలు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎం కార్యాలయం నుంచి గంట గంటకు ఇక్కడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని మంత్రి తెలిపారు.

‘‘నీరు, ఫుడ్ పాయిజన్‌ లాంటివి ఏమీ జరగలేదు. విజయవాడ ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చింది. నిపుణుల బృందాలు కూడా ఏలూరు రానున్నాయి. ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతాల్లో వాలంటీర్లు సర్వే చేపట్టారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని రేపు(సోమవారం) సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శిస్తారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సీఎం సమీక్షిస్తారని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)