amp pages | Sakshi

‘దివీస్‌’ ఆందోళనకారులపై కేసుల తొలగింపునకు సర్కారు ఆదేశాలు

Published on Sun, 12/20/2020 - 03:33

సాక్షి, అమరావతి: దివీస్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై పెట్టిన కేసులన్నిటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలని సంబంధిత యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. స్థానికులు, మత్స్యకారుల అభ్యంతరాలను పరిష్కరించి, వారి ఆమోదం తెలిపిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట పంచాయతీ పరిధిలో దివీస్‌ పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా రైతులు, స్థానిక ప్రజలు, మత్స్యకారుల ఆందోళనలు, సున్నిత అంశాల పరిష్కారానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దివీస్‌ యాజమాన్యం, పరిశ్రమల శాఖ అధికారులు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తో శనివారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానికుల అభ్యంతరాలన్నీ పరిష్కరించి, వారి ఆమోదం తెలిపే వరకు ఒక్క ఇటుక కూడా కదపకూడదన్న ప్రభుత్వ ఆదేశాలకు దివీస్‌ ఫార్మా డైరెక్టర్‌ కిరణ్‌ దివి అంగీకరించారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను దివీస్‌ యాజమాన్యం అంగీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. సీఎస్‌ఆర్‌ నిధులను ఇప్పటికే ఖర్చు చేస్తున్నామని, ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాల ప్రకారం గుడ్‌ ఫెయిత్‌ కింద మరింత సాయమందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రికి తెలిపారు. 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వడంతోపాటు నిరసన వ్యక్తం చేసిన రైతులు, మత్స్యకారులపై కేసులను ఉపసంహరించుకుంటామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీఐఐసీ వైస్‌ చైర్మన్‌ రవీన్‌రెడ్డి, తూర్పు గోదావరి కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఎండీ వివేక్‌యాదవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ప్రతిపాదనలివీ
► దివీస్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై మోపిన కేసులన్నిటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలి. కాలుష్యం విషయంలో మత్స్యకారుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, వారితో సమావేశమై దివీస్‌ యాజమాన్యం చర్చలు జరపాలి.
► మత్స్యకారులకు అవగాహన కల్పించి, వారు స్పష్టమైన అంగీకారానికి వచ్చేలా సమస్యలను పరిష్కరించాలి. పరిశ్రమలో 75 శాతం ఉద్యోగాలను తప్పనిసరిగా స్థానికులకే ఇవ్వడంతో పాటు సీఎస్‌ఆర్‌ నిధులతో పాటు సమాజ హితం కోసం, స్థానిక ప్రజల క్షేమం కోసం చొరవ చూపి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి.
► అవసరమైతే స్థానికులకు ఉద్యోగాల నిమిత్తం నైపుణ్య సహకారం అందించేందుకు ప్రత్యేకంగా స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు.
► దివీస్‌ విడుదల చేసే కాలుష్యం వల్ల వాతావరణ సమస్య,  స్థానిక మత్స్యకారుల ఆరోగ్యానికి హాని కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు హామీ ఇవ్వాలి.
► దీనిని ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి ఎండీకి మంత్రి ఆదేశాలు జారీ చేశారు.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)