amp pages | Sakshi

తిని.. పూడుస్తుంది!.. ‘గుడ్‌’ బ్యాక్టీరియా

Published on Fri, 02/17/2023 - 09:37

సాక్షి, అనంతపురం: సిమెంట్‌ కాంక్రీట్‌ను పటి­ష్టంగా ఉంచడానికి మధ్యలో ఇనుప కడ్డీ­ల­ను వినియోగిస్తారు. ఈ కడ్డీలు కాంక్రీట్‌కు అదనపు బలం చేకూర్చినా.. వాటి­వల్ల పగుళ్లు ఏర్పడతాయి. కాంక్రీట్‌ మిశ్ర­మా­న్ని బట్టి కూడా చిన్నపాటి పగుళ్లు ఏర్ప­డుతుంటాయి. ఇందులోకి నీరు లేదా తేమ చేరి ఇనుప కడ్డీలు తుప్పు పట్టడం, పగుళ్లు పెరిగి పెచ్చు­లు ఊడిపోవడం వంటివి చోటుచేసుకుంటాయి. ము­ఖ్యం­గా సముద్రతీర ప్రాంతాల్లోని గృహాల్లో ఉప్పు­నీటి ఆవిరి కారణంగా స్లాబ్‌లలో పగుళ్లు ఏర్పడ­తాయి. పగుళ్లతో వచ్చే సమస్యను అధిగమించేందుకు ప్రస్తుతం వివిధ రకాల విధానాలు అనుసరి­స్తున్నారు. గ్రౌటింగ్, ఎఫ్‌ఆర్‌సీ ఫిల్లింగ్‌ విధానాలు ఉన్నా.. వీటివల్ల కలిగే ప్రయోజనం తాత్కాలికమే. పైగా ఈ విధానాలు అత్యధిక ఖర్చుతో కూడుకు­న్నవి.

ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు అనంతపురం జేఎన్‌టీయూ సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్లు హెచ్‌.సుదర్శనరావు, వైశాలి జి.గోర్పడే వినూత్న పరిశోధనకు శ్రీకారం చుట్టారు. అనంతపురం జేఎన్‌టీయూలో వివిధ విధానాలపై ఆరేళ్లపాటు పరిశోధనలు, ప్రయో­గాలు జరిపి అత్యంత చౌకగా.. సుదీర్ఘకాలం మన్ని­కగా ఉండే ‘బ్యాక్టీరియల్‌ కాంక్రీట్‌’ విధానానికి రూపకల్పన చేశారు. వీరి పరిశోధన విజయవంతమై ఇండియన్‌ పేటెంట్‌ సైతం లభించింది. 

మిత్ర బ్యాక్టీరియాలతో సమస్యకు చెక్‌
పరిశోధనలో భాగంగా ప్రొఫెసర్లు ఎయిరోఫిలి­యస్, ప్లెక్సెస్, స్టార్టోౖ­స్పెరికాస్‌ అనే మూడు రకాల మిత్ర బ్యాక్టీరి­యాల­ను ఉపయోగించారు. విభిన్న ప్రాంతాల నుంచి మురికి నీటిని సేకరించి అందులో మట్టి కలిపారు. అందులోనే బ్యాక్టీరియాను అభి­వృ­ద్ధి చేశారు. తక్కువ కాలంలోనే బ్యాక్టీరియా రెట్టింపు అవుతున్నట్టు గుర్తించారు. ఈ బ్యాక్టీరి­యాలు
కాంక్రీట్‌లో ఉండే సీఎ‹­Üహెచ్‌(కాల్షియం సిలికేట్‌ హైడ్రేట్‌) జెల్‌ను ఆహారంగా తీసు­కుం­­టూ సుదీర్ఘకాలంపాటు బతికే­స్తా­య­ని గుర్తించారు.

అక్కడ బ్యాక్టీరియా ఉత్ప­త్తి చేసే కాల్షియం కార్బొనేట్‌ పగుళ్ల లోలోప­లకి చొచ్చుకుంటూ వెళ్లి పగుళ్లను పూడుస్తాయి. కాంక్రీట్‌లో ఉన్న సీఎస్‌హెచ్‌ జెల్‌ తింటూ బ్యాక్టీరి­యా తన సంతానాన్ని వృద్ధి చేసుకుంటూపోతుంది. కాంక్రీట్‌­లో ఉండే ‘సీఎస్‌హెచ్‌ జెల్‌’ పూర్తిగా వినియో­గం కావడానికి చాలా ఏళ్లు పడుతుంది. కాబట్టి బ్యాక్టీరియా లోపల హాయిగా బతికేస్తుంది. మిత్ర బ్యాక్టీరియా కాబట్టి మానవాళికి హానికరం కాదు. 

రెండు పరిశోధనలు విజయవంతం
కాంక్రీట్‌ మిశ్రమాన్ని స్లాబ్‌పై వేసే సమయంలోనే బ్యాక్టీరియాను కలిపారు. భవ­నం పటిష్టంగా ఉండటంతో పాటు ఎక్కువ కాలం
మన్నిక ఉంటుందని తేటతెల్లమైంది.
కాగా, భవనాలకు పగుళ్లు వచ్చిన తర్వాత బ్యాక్టీరియాను ప్రవేశపెట్టి.. అభివృద్ధి చేయడం ద్వారా పగుళ్లను వాటితోనే భర్తీ చేశారు. తద్వారా పగుళ్లు పూడుకుపోవడంతోపాటు భవనం పటిష్టత పెరుగుతూ వచ్చింది. 
ఈ రెండు పరిశోధనలు విజయ­వంతం కావడంతో ప్రొఫెసర్లు హెచ్‌.సుదర్శన­రావు, వైశాలి జి.గోర్పడే ‘మెథడ్స్‌ ఫర్‌ ప్రిపరేషన్‌ ఆఫ్‌ బ్యాక్టీరియల్‌ కాంక్రీట్‌ విత్‌ సెల్ఫ్‌ హీలింగ్‌ ఎబిలిటీస్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌ దేర్‌ ఆఫ్‌’ పేరిట సమర్పించిన అంశానికి పేటెంట్‌ దక్కింది. 

ఆరేళ్ల పరిశోధనల ఫలితమిది
కాంక్రీట్‌లో పగుళ్లు ఏర్ప­డినా.. భవనం దెబ్బతిన­కుండా ఉండేందుకు వీ­లుగా బ్యాక్టీరియల్‌ కాంక్రీట్‌ విధా­నంపై సుదీర్ఘ­మైన పరిశోధ­నలు చేశాం. అత్యంత చౌకైన విధానం ఇది. మెరుగైన ఫలితం వస్తుంది. భవనాలు ఎక్కువ కాలం మన్నిక వచ్చే­లా సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాం. ఇందుకు పేటెంట్‌ దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఆరేళ్లపాటు చేసిన పరిశోధనకు ఫలితం దక్కింది. నెదర్లాండ్స్‌లోని డెల్ఫ్‌ట్‌ యూ­నివర్సిటీ వారు ఈ పరిశోధన వినియోగించడానికి జేఎన్‌టీయూ­(ఏ)తో సంప్రదింపులు జరుపుతున్నారు.
– ప్రొ. సుదర్శనరావు, ప్రొ.వైశాలి జి.గోర్పడే, సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం, జేఎన్‌టీయూ అనంతపురం 

Videos

ఏలూరులో చల్లారని రగడ...

బస్సు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు

చంద్రబాబు ఎత్తులు ఫలించాయా !..సక్సెస్ రేట్ ఎంత..?

ఉప్పెనలా ఏపీలో ఓటింగ్.. రాబోయేది 'ఫ్యాన్' టాస్టిక్ రిజల్ట్స్

తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!

పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)