చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జేసీ వర్గీయుల హంగామా.. నిలిచిన 108 అంబులెన్సు
Published on Thu, 08/06/2020 - 21:19
సాక్షి, అనంతపురం : మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు గురువారం అత్యుత్సాహం చూపించారు. కడప కేంద్ర కారాగారం నుండి జేసీ, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు గురువారం విడుదలయ్యారు. అక్రమ వాహనాల కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్ద జేసీ వర్గీయులు హంగామా చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా భారీ కాన్వాయ్‌తో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌లు కడప నుంచి తాడిపత్రి చేరుకున్నారు.
తాడిపత్రికి వెళ్లే సమయంలో కడప బైపాస్‌లో భారీ కాన్వాయ్ కారణంగా 108 అంబులెన్సు వాహనం నిలిచిపోయింది. జేసీ అనుచరుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. కరోనా వ్యాప్తి సమయంలో ఇలాంటివి అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
#
Tags