amp pages | Sakshi

Dappu Ramesh‌: డప్పు రమేష్‌ కన్నుమూత

Published on Sat, 03/19/2022 - 08:35

లబ్బీపేట (విజయవాడ తూర్పు)/తెనాలి: డప్పు రమేష్‌గా ప్రాచుర్యం పొందిన జన నాట్యమండలి కళాకారుడు ఎలియాజర్‌ (61) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని అంగలకుదురు ఆయన స్వగ్రామం. తెనాలిలోని వీఎస్సార్‌ అండ్‌ ఎన్‌వీఆర్‌ కాలేజీలో డిగ్రీ చదివాడు. ఆ సమయంలో రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌లో చేరారు. 1981లో పీపుల్స్‌ వార్‌ పార్టీ ఆదేశాల మేరకు ఆ పార్టీ సాంస్కృతిక దళమైన జన నాట్యమండలి శిక్షణ తరగతులకు వెళ్లారు. ఆ తరువాత పూర్తిస్థాయి విప్లవ కళాకారుడిగా మారారు.

చదవండి: AP: భరోసాపై బురద రాతలు.. అన్నదాతల్లో ఆగ్రహం

గద్దర్, దివాకర్‌లతో పాటు జన నాట్యమండలిలో పనిచేశారు. నల్లమల అడవులు, దండకారణ్యంలో సంచరించారు. కొంతకాలం అజ్ఞాత జీవితం గడిపారు. అంతకుముందు ఉద్యమ కళాకారిణి కుమారిని వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి ఆమె మలేరియా బారినపడి మరణించడంతో జ్యోతి అనే ఉద్యమకారిణిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. రమేష్‌ అంత్యక్రియలు శనివారం పల్నాడులోని జూలకల్లు గ్రామంలో జరుగుతాయని ఆయన భార్య జ్యోతి వెల్లడించారు.

Videos

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్

లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)