amp pages | Sakshi

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న విద్యార్థులు

Published on Fri, 11/19/2021 - 03:05

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య ఏటేటా పెరుగుతోందని వార్షిక విద్యా స్థితి నివేదిక (ఏఎస్‌ఈఆర్‌)–2021 వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు కాని విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయిందని పేర్కొంది. 25 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 581 జిల్లాల్లో ఈ మేరకు సర్వే నిర్వహించారు. 17,184 గ్రామాల్లోని 76,706 కుటుంబాలను సర్వేలో భాగంగా సంప్రదించారు. 7,299 పాఠశాలల్లో 75,234 మంది 5–16 ఏళ్ల లోపు విద్యార్థులను సర్వే చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని 390 గ్రామాల్లో 2,367 కుటుంబాలు, 1,507 మంది విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో 223 మంది 1, 2 తరగతుల వారు, 375 మంది 3–5 తరగతులు, 421 మంది 6–7 తరగతులు, 304 మంది 8–10 తరగతుల వారున్నారు. విద్యార్థుల నమోదు, ట్యూషన్, స్మార్ట్‌ ఫోన్లు, విద్యలో కుటుంబ సభ్యుల సహకారం, అందుబాటులో మెటిరీయల్‌ తదితర అంశాలపై ఈ సర్వే ద్వారా వివరాలు సేకరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

అన్ని అంశాల్లోనూ టాప్‌
► దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 2018లో 64.3 శాతం విద్యార్థులు చేరగా, 2021లో 70.3 శాతం విద్యార్థులు చేరారు. 
► ఆంధ్రప్రదేశ్‌లో 2018లో 62.2 శాతం (65.1 శాతం బాలికలు, 59 శాతం బాలురు), 2020లో 69.9 శాతం (69.5 శాతం బాలికలు, 64.4 శాతం బాలురు) నమోదైంది. 2021లో 70.6 శాతం (బాలికలు 77.2 శాతం, 63.7 శాతం బాలురు) విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.
► మూడేళ్లుగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల నమోదు శాతం ఐదుకు పైగా పెరిగింది. 2018లో కంటే 2021లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య జాతీయ సగటు (6.1 శాతం) కంటే 8.4 శాతం ఎక్కువ. 
► దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ట్యూషన్‌కు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇది 2018లో 28.6 శాతమైతే 2021లో 39.2 శాతానికి చేరింది. ట్యూషన్లకు వెళ్లే వారిలో బాలురే ఎక్కువ.   
► ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ట్యూషన్‌కు వెళ్తున్న వారి సంఖ్య 2018లో 14.7 శాతం ఉండగా, 2021లో 22.7 శాతానికి పెరిగింది.
► దేశ వ్యాప్తంగా 2018లో 36.5 శాతం (29.6 శాతం ప్రభుత్వ, 49.9 శాతం ప్రైవేటు పాఠశాలలు) విద్యార్థులకు ఇంటి వద్ద స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులో ఉంది. 2021 నాటికి ఆ సంఖ్య 67.6 శాతానికి (63.7 శాతం ప్రభుత్వ, 79 శాతం ప్రైవేటు విద్యార్థులు) చేరింది. 
► ఆంధ్రప్రదేశ్‌లో 2018లో 42.1 శాతం విద్యార్థులకు ఇంటి వద్ద స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులో ఉండగా.. 2020లో 61.5 శాతం, 2021లో 72.3 శాతానికి పెరిగింది. వివిధ కారణాల వల్ల 18.6 శాతం మంది స్మార్ట్‌ ఫోను వినియోగించుకోలేకపోతున్నారు. 
► దేశ వ్యాప్తంగా 66.6 శాతం మంది విద్యార్థులకు.. ఆంధ్రప్రదేశ్‌లో 62 శాతం మంది విద్యార్థులకు కుటుంబ సభ్యులు చదువులో సహకరిస్తున్నారు.  
► దేశ వ్యాప్తంగా 91.9 శాతం మంది విద్యార్థులు.. ఆంధ్రప్రదేశ్‌లో 96.3 శాతం మంది విద్యార్థులు పాఠ్య పుస్తకాల కోసం పేరు నమోదు చేసుకున్నారు.    

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌