amp pages | Sakshi

వరద తగ్గుముఖం

Published on Mon, 08/22/2022 - 03:53

సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్ట్‌/ విజయపురిసౌత్‌: పరివాహక ప్రాంతాల్లో (బేసిన్‌లో) వర్షాలు తెరపి ఇవ్వడంతో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి నదుల్లో వరద తగ్గుముఖం పడుతోంది. వర్షపాత విరామం వల్ల ఉపనదుల్లో వరద తగ్గడంతో ఆదివారం గోదావరి ప్రవాహం సాధారణ స్థాయికి చేరుకుంది. భద్రాచలం వద్ద వరద మట్టం 30.9 అడుగులకు తగ్గింది. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్న జలాల్లో ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 8,50,469 క్యూసెక్కులు చేరుతున్నాయి.

ఇందులో గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 8,39,469 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు వరద మట్టం 11.7 అడుగులకు తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గిన నేపథ్యంలో సోమవారం ధవళేశ్వరం వద్ద ప్రవాహం మరింత తగ్గనుంది.

స్థిరంగా వంశధార, నాగావళి 
వంశధార, నాగావళి నదుల్లో వరద స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 40,602 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 1,186, ఎడమ కాలువకు 142 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 30,186 క్యూసెక్కులను బ్యారేజ్‌ 16 గేట్లను 0.6 మీటర్ల మేర ఎత్తి బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి తోటపల్లి బ్యారేజ్‌లోకి 11,462 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 1,520 క్యూసెక్కులను విడుదల చేస్తూ, 6,979 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు నారాయణపురం ఆనకట్ట మీదుగా బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. 

శ్రీశైలం జలాశయంలోకి 2.16 లక్షల క్యూసెక్కులు
కృష్ణా, ఉపనదుల్లో వరద ప్రవాహం మరింతగా తగ్గింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,16,946 క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 18 వేలు, కల్వకుర్తి ద్వారా 1,600, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులు తరలిస్తున్నారు. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,954, స్పిల్‌ వే నాలుగు గేట్లను పదడుగులు ఎత్తి 1,11,564.. మొత్తం 1,74,518 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.6 అడుగుల్లో 213.4 టీఎంసీల నీటిని నిల్వచేస్తున్నారు.

నాగార్జునసాగర్‌లోకి 1,62,647 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 9,500, ఎడమ కాలువకు 8,108, ఏఎమ్మార్పీకి 1,800, వరద కాలువకు 400 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,967, స్పిల్‌ వే 14 గేట్లను ఐదడుగులు ఎత్తి 1,09,872.. మొత్తం 1,42,839 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 585.6 అడుగుల్లో 305.86 టీఎంసీల నీరు ఉంది. పులిచింతలలోకి 1,36,192 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ 8వేలు, స్పిల్‌ వే 5 గేట్లను మూడడుగులు ఎత్తి 1,15,665.. మొత్తం 1,23,665 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.

ప్రస్తుతం పులిచింతలలో 169.81 అడుగుల్లో 38.08 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,59,148 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణాడెల్టాకు 13,898 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మిగిలిన 1,45,250 క్యూసెక్కులను 60 గేట్లను మూడడుగులు, 10 గేట్లను రెండడుగులు ఎత్తి çకడలిలోకి వదిలేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయిని డ్యామ్‌లలోకి వరద తగ్గడంతోసోమవారం శ్రీశైలంలోకి వచ్చే వరద మరింత తగ్గనుంది. 

Videos

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

Photos

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)