amp pages | Sakshi

గిరిజన ప్రాంతాల్లో బైక్‌ల ద్వారా రేషన్‌ సరఫరా 

Published on Thu, 12/29/2022 - 04:57

సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ చెప్పారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల జాయింట్‌ కలెక్టర్లతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సరుకు రవాణాకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లో కొత్త ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు, బఫర్‌ గోడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

మారుమూల, కొండ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, ఎండీయూ వాహనం వెళ్లలేని గిరిజన గ్రామాలకు బైక్‌ల ద్వారా ఇంటింటికీ రేషన్‌ సరఫరా చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

జనవరి నుంచి కందిపప్పు, పంచదార పంపిణీతో పాటు అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల వద్దకే నిత్యావసరాలు డెలివరీ చేసేలా చూడాలన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీల్లో అవసరాన్ని బట్టి కలెక్టర్‌ కొత్త రేషన్‌ షాపులు మంజూరు చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో దాదాపు 45 శాతానికి పైగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్టు కమిషనర్‌ తెలిపారు. జనవరి చివరి నాటికి ఖరీఫ్‌ సేకరణ పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని, ధాన్యం కొనుగోళ్ల సొమ్ముతో పాటు మిల్లర్ల బకాయిలనూ వేగంగా చెల్లిస్తున్నట్టు చెప్పారు.

16 రోజులు దాటిన ఎఫ్‌టీవోలకు చెల్లింపులు పూర్తి చేసినట్టు తెలిపారు. మిల్లర్లు ప్రభుత్వం చెల్లించే బకాయిల్లో కొంత మొత్తం వెచ్చించి ఆరబోత యంత్రాలు (డ్రయర్లు) ఏర్పాటు చేయాలని, లేకుంటే.. 2023 ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఆయా మిల్లులకు సీఎంఆర్‌ నిలిపివేస్తామని కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ హెచ్చరించారు.   

Videos

ఏలూరులో చల్లారని రగడ...

బస్సు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు

చంద్రబాబు ఎత్తులు ఫలించాయా !..సక్సెస్ రేట్ ఎంత..?

ఉప్పెనలా ఏపీలో ఓటింగ్.. రాబోయేది 'ఫ్యాన్' టాస్టిక్ రిజల్ట్స్

తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!

పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)