amp pages | Sakshi

ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్‌ సమీక్ష

Published on Sat, 06/03/2023 - 09:38

సాక్షి, తాడేపల్లి: ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది. కాగా, రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి మంత్రి అమర్నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందాన్ని పంపించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో ఎంకైర్వీ విభాగాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఘటనా స్థలానికి పంపించాడానికి అంబులెన్స్‌లు సన్నద్ధం కావాలని సూచించారు. ఎమర్జెన్సీ సేవల కోసం విశాఖ సహా ఒడిషా సరిహద్దు జిల్లాల్లో ఆసుపత్రులు అలర్ట్‌గా ఉండాలని అధికారులను ఆదేశించారు. 


కోరమండల్‌ రైలులో పలువురు ఏపీ రాష్ట్రవాసులు.. 
- విజయవాడ రీజియన్‌లో దిగేందుకు మొత్తం 48 మంది రిజర్వేషన్‌
- కోరమండల్‌ నుంచి విజయవాడకు 35 మంది రిజర్వేషన్‌
- ఏలూరుకు రిజర్వేషన్‌ చేసుకున్న ఇద్దరు ప్రయాణీకులు
- తాడేపల్లిగూడెంకు ఒకరు రిజర్వేషన్‌ 
- రాజమండ్రి స్టేషన్‌లో దిగేందుకు 12 మంది రిజర్వేషన్‌. 

ఇక, ఈ రైలులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 124 మంది ప్రయాణీకులు ఉన్నట్టు సమాచారం. రాజమండ్రి స్టేషన్‌లో 24 మంది దిగాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఒడిషాలో ఆగివున్న గూడ్స్‌ రైలును కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడం, పట్టాలు తప్పిన కోరమండల్‌ బోగీలను యశ్వంతపూర్‌ రైలు ఢీకొట్టడంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఈ ప్రమాదంలో అధికారికంగా ఇప్పటి వరకు 233 మంది ప్రయాణీకులు మృతి చెందగా, వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. 

ఇది కూడా చదవండి: పట్టాలపై మృత్యుకేళి.. ఘటనపై దర్యాప్తునకు హైలెవల్‌ కమిటీ

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)