amp pages | Sakshi

అమరావతిపై ఇక నివేదికలిస్తా

Published on Thu, 08/06/2020 - 03:38

సాక్షి, హైదరాబాద్‌: మూడు రాజధానులపై ప్రజాతీర్పు కోరేందుకు అసెంబ్లీని రద్దు చేయాలన్న తన సవాల్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించకుండా పారిపోయారని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. విభజన కంటే మూడు రాజధానుల ఏర్పాటుతోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగనుందన్నారు. 3 రాజధానులపై ప్రభుత్వానికి 48 గంటల డెడ్‌లైన్‌ విధిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు బుధవారం హైదరాబాద్‌ నుంచి ఎంపిక చేసిన మీడియాతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు.

► రాజధానిగా అమరావతి ఎందుకు అవసరమో రెండు రోజులకోసారి ప్రజలకు నివేదికల రూపంలో వివరిస్తా. 
► అమరావతిని మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. మూడు ముక్కలాట ఆడుతూ అమరావతిని నాశనం చేస్తున్నారు. రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని కాపాడాలి. 
► రాజధాని అమరావతిని కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. అది కేంద్రం పరిధిలోని అంశం కాదని కొందరు బీజేపీ నేతలు చెప్పడం సరికాదు. 
► కరోనా వైరస్‌ ప్రబలుతున్న సమయంలో రాజధాని మార్పు గురించి ప్రభుత్వం ఆలోచిస్తుండటం ఏమిటి? రాజధానిగా అమరావతిని కాపాడుకునేందుకు ప్రజల్లో తిరుగుబాటు, చైతన్యం రావాలి. 
► మాట మార్చడం తమ ఇంటా వంటా లేదన్న సీఎం వైఎస్‌ జగన్‌ అమరావతిపై ఎందుకు మాటమార్చి ప్రజలను మోసం చేస్తున్నారు? ఇప్పటికైనా ప్రభుత్వం అమరావతిని పరిరక్షించాలి. 
► అమరావతిని ఏకైక రాజధానిగా ప్రభుత్వం ప్రకటిస్తే మేం పదవులను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మూడు రాజధానులను అడ్డుకుని తీరతాం. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)