amp pages | Sakshi

మత రాజకీయాలకు చోటులేదు

Published on Sat, 01/09/2021 - 04:13

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మత విద్వేషాలకు తావులేదని, క్షుద్ర రాజకీయాలకు పాల్పడే వారి పట్ల ప్రజలంతా  అప్రమత్తంగా ఉండాలని సర్వమతాలకు చెందిన పెద్దలు విజ్ఞప్తి చేశారు. మతకల్లోలాలు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అన్ని మతాల వారు అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవిస్తున్నారని చెప్పారు. పార్టీలు రాజకీయాలు చేసుకోవచ్చు కానీ ప్రజలకు చేటు చేసేలా, మతాలను కించపరిచేలా, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఏ పార్టీ, ఏ వర్గమూ, ఏ ఒక్కరూ వ్యవహరించవద్దని సవినయంగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు మంత్రుల కమిటీ శుక్రవారం విజయవాడలో నిర్వహించిన సర్వమత సమావేశంలో పాల్గొన్న అనంతరం మతపెద్దలు ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలివీ..

అలాంటి ధోరణులు సరికాదు..
మన రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం ఉంది. మతపరమైన విద్వేషాలు లేవు. హిందువులు, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు.. అన్ని మతాల ప్రజలు తమ ఆచారానికి అనుగుణంగా జీవనం గడుపుతున్నారు. ఎక్కడా మతపరంగా మెజార్టీ, మైనార్టీ అన్న భావన ప్రజల్లో లేదు. ఇటీవల మారుమూల ప్రాంతాల్లోని ఆలయాల్లో జరుగుతున్న ఘటనలు, అనంతరం కొందరు చేస్తున్న విషపూరిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఈ తరహా ధోరణులు ఎంతమాత్రం సబబు కాదు. విద్వేషాలను విరజిమ్మేలా వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టే ధోరణి ఏమాత్రం తగదు. ఈ పని ఎవరు చేసినా ఆమోదయోగ్యం కాదు. 

వన్నె తరగని మత సామరస్యం
తరతరాలుగా మత సామరస్యం భారతీయ సంస్కృతికి వన్నె తెచ్చింది. చుట్టుపక్కల దేశాల్లో రాజకీయంగా, సామాజికంగా అస్థిర పరిస్థితులు ఉన్నా... ప్రజలు కలసి మెలసి ఉంటున్నారు కాబట్టే మన దగ్గర సుస్థిర ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గర ఒకే చోట ఆలయం, దర్గా కనిపిస్తాయి. ఉర్సు (ముస్లింల ఆధ్యాత్మిక కార్యక్రమం) ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో హిందువులూ హాజరుకావడం ఆనవాయితీగా వస్తోంది. నెల్లూరు జిల్లాలో బారా షహీద్‌ దర్గా వద్ద  జరిగే రొట్టెల పండుగకు అన్ని మతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. చాలామంది హిందువులు మస్తాన్‌ అనే పేరు పెట్టుకోవడం చూశాం. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు తరతరాలుగా కలిసే ఉంటున్నారు. ఇక మీదట కూడా అలాగే ఉంటారు. 

కుట్రదారులకు నిలువనీడ లేకుండా చేయాలి..
ప్రభుత్వ పథకాల అమలులో మతాలకు అతీతంగా పేదలకు సాయం చేయటమే ఏకైక ప్రామాణికంగా ఉన్నప్పుడు, అన్ని మతాలకూ గౌరవ మర్యాదలు దక్కుతున్నప్పుడు, ప్రభుత్వ పెద్దలు అన్ని మతాల సంప్రదాయాలకు గౌరవం ఇస్తున్నప్పుడు... మత సామరస్యాన్ని దెబ్బతీసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికావు. ఏ దేవాలయం మీద దాడి చేసినా, ఏ ప్రార్థనా మందిరం మీద దాడి చేసినా అది ముమ్మాటికీ తప్పు. ఆ తప్పు చేసినవారు కచ్చితంగా శిక్షించబడాలి. అలాంటి ఘటనలను ఆసరాగా తీసుకుని లేని విద్వేషాలను సృష్టించే ప్రయత్నాలు చేయవద్దు. లేని విచ్ఛినాన్ని దయచేసి తెలుగు సమాజంలోకి తీసుకురాకండి. ప్రజలంతా ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రతో బయలుదేరిన వ్యక్తులకు నిలువనీడ లేకుండా చేయాలి. తప్పు చేసినవారిని వెతికి పట్టించేందుకు గ్రామాల్లో ప్రజలు సహకరించాలి.

రాష్ట్రంలో అన్ని మతాలవారు సంయమనం పాటిస్తూ సౌభ్రాతృత్వంతో మెలగాలి. తమ మతాలను అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలి.
– వేణుగోపాల దీక్షితులు, ప్రధాన అర్చకులు, తిరుమల శ్రీవారి ఆలయం

ప్రజలంతా ప్రేమ, శాంతితో జీవనం సాగించాలి. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం మంచి పాలన అందిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు పరస్పరం సహనం, స్నేహభావంతో మెలగాలి. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతున్న సమయంలో కొన్ని దుస్సంఘటనలు జరగడం బాధాకరం. ఏ మతం కూడా విధ్వంసాన్ని ప్రోత్సహించదు.
– సయ్యద్‌ అహ్మద్‌ పీర్‌ షామిరీ, షామీరా పీఠాధిపతి 

ప్రజాస్వామ్యయుతమైన మన దేశంలో ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో మెలగాలి. ప్రేమ, సహనం, సర్వమత సౌభ్రాతృత్వమే సమాజం అనుసరించే విధానం కావాలి. మత విద్వేషాలను ఏ మతం కూడా అంగీకరించదు. మౌఢ్యం, విద్రోహ చర్యలకు మతాన్ని వాడుకోవాలని కొందరు భావించడం క్షమార్హం కాదు. అలాంటి వాటిని ప్రజలు సమష్టిగా తిప్పికొట్టి శాంతియుత జీవనం సాగించాలి’
    – సీహెచ్‌ మోడరేటర్, రెవరెండ్‌   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)