amp pages | Sakshi

ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌కు అస్వస్థత.. హెల్త్‌ బులెటిన్ విడుదల

Published on Wed, 11/17/2021 - 10:49

AP Governor Biswabhusan Harichandan is Unwell: సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆరోగ్యంపై ఏఐజీ హస్మిటల్స్‌ హెల్త్‌ బులెటిన్ విడుదల చేసింది. 88 ఏళ్ల గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ నవంబర్ 17న మధ్యాహ్నం 1 గంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ  హాస్పిటల్స్‌లో అడ్మిట్ అయ్యారని వైద్యులు పేర్కొన్నారు.

అయితే  గవర్నర్‌కు నవంబర్ 15న కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 

వివరాలు తెలుసుకున్న సీఎం జగన్‌
గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆరోగ్యంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఏఐజీ చైర్మన్‌, సీనియర్‌ వైద్యుడు డాక్టర్‌ డి.నాగేశ్వర్‌ రెడ్డితో సీఎం నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గవర్నర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని ఈ సందర్భంగా డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు.
(చదవండి: మరోసారి మెరిసిన ఏపీ పోలీస్‌)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)