amp pages | Sakshi

Andhra Pradesh: క్రీడా ప్రతిభా అవార్డులకు 65 పాఠశాలల ఎంపిక 

Published on Sat, 08/28/2021 - 03:25

విజయవాడ స్పోర్ట్స్‌: రాష్ట్ర వ్యాప్తంగా 65 జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను క్రీడా ప్రతిభా అవార్డులకు ఎంపిక చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ చినవీరభద్రుడు, స్కూల్‌ గేమ్స్‌ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తి శుక్రవారం వెల్లడించారు. 2019–20 విద్యా సంవత్సరంలో క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన పాఠశాలలను (జిల్లాకు ఐదు చొప్పున) ఈ అవార్డులకు ఎంపిక చేశామన్నారు. ఈ నెల 29వ తేదీ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయా పాఠశాలలకు అవార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. మొదటి స్థానంలో నిలిచిన పాఠశాలకు రూ.10 వేలు, రెండోవ స్థానంలో ఉన్న పాఠశాలకు రూ.8 వేలు, మూడో స్థానానికి రూ.6 వేలు, నాలుగో స్థానంలో ఉన్నవాటికి రూ.4 వేలు, ఐదో స్థానంలో ఉన్నవాటికి రూ.2 వేలు చొప్పున నగదు,  జ్ఞాపికలు అందజేస్తామన్నారు. 

అవార్డులకు ఎంపికైన పాఠశాలలు ఇవే:  
శ్రీకాకుళం జిల్లాలోని అల్లినగరం (ఎచ్చెర్ల మండలం), కేశవరావుపేట (ఎచ్చెర్ల మండలం), ఇప్పిలి (శ్రీకాకుళం), ఫరీద్‌పేట (ఎచ్చెర్ల), లింగవలస (టెక్కలి), విజయనగరం జిల్లాలోని పరది (బొబ్బిలి), టెర్లాం (టెర్లాం), వి.ఆర్‌.పేట (ఎస్‌.కోట), అరకితోట (ఆర్‌.బి.పురం), కస్పా (విజయనగరం), విశాఖపట్నం జిల్లాలోని చంద్రంపాలెం (చినగాడిల్లి), ఏపీటీర్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ (అరకు వ్యాలీ), ఏఎమ్‌జీ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ (భీమిలి), ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ స్కూల్‌(సింహాచలం), తుమ్మలపాలెం (అనకాపల్లి), తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురపాడు (కరప), గొల్లపాలెం (కాజులూరు), జి.గన్నవరం (ఐ.పోలవరం), గవర్నమెంట్‌ హైస్కూల్‌ (కిర్లంపూడి), జి.మామిడ్డ (పెదపూడి), పశ్చిమగోదారి జిల్లాలో ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం స్కూల్‌ (భీమవరం), కామవరపుకోట(కామవరపుకోట), కె.గోకవరం (గోకవరం), ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ స్కూల్‌ (పెదవేగి), ఇరగవరం (ఇరగవరం), కృష్ణాజిల్లాలోని ఎస్‌కేపీవీవీ హిందూ హై స్కూల్‌ (విజయవాడ).

ఉయ్యూరు (ఉయ్యూరు), జెడ్పీ బాలుర హైస్కూల్‌ (నూజివీడు), జెడ్పీ బాలుర హైస్కూల్‌ (కొండపల్లి), జెడ్పీ బాలికల హైస్కూల్‌ (నూజివీడు), గుంటూరు జిల్లాలోని ఏఎంజీ హైస్కూల్‌ (చిలకలూరిపేట), చింతయ్యపాలెం (కర్లపాలెం), రాజుపాలెం(రాజుపాలెం), ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ స్కూల్‌ (అచ్చంపేట), ఎస్‌బీపురం (నరసరావుపేట), ప్రకాశం జిల్లాలోని కారేడు (ఉలవపాడు), కంచర్లవారిపల్లి (కనిగిరి), చిర్రికూరపాడు (జరుగుమిల్లి), పాకల (ఎస్‌.కొండ), పేర్నమిట్ట (ఎస్‌.ఎన్‌.పాడు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వింజమూరు (వింజమూరు), శ్రీకొలను (ఏఎస్‌పేట), ఇందుకూరుపేట (ఇందుకూరుపేట), వెంగళరావునగర్‌ (నెల్లూరు), తెల్లపాడు (కలిగిరి), వైఎస్సార్‌ జిల్లాలోని ఎంసీ హైస్కూల్‌ మెయిన్‌ (కడప), డీబీసీఎస్‌ఎం హై స్కూల్‌ (ప్రొద్దుటూరు), రమణపల్లి (చెన్నూర్‌), కేజీబీవీ స్కూల్‌ (రామాపురం, కడప), ఎస్‌వీవీ ప్రభుత్వ బాలుర హైస్కూలు (ప్రొద్దుటూరు), కర్నూలు జిల్లాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఆత్మకూరు), ప్రభుత్వ హైస్కూలు (జూపాడు బంగ్లా), భాగ్యనగరం(డోర్నిపాడు), కేజీబీవీస్కూల్‌ (ఆళ్లగడ్డ), చాగలమర్రి (చాగలమర్రి), అనంతరపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం (బుక్కరాయసముద్రం), అమిద్యాల(ఉరవకొండ), కొనకొండ్ల (వజ్రకరూర్‌), పులిమిట్టి (లేపాక్షి), రాప్తాడు (రాప్తాడు), చిత్తూరు జిల్లాలోని మదనపల్లి (మదనపల్లి), తరిగొండ (గుర్రంకొండ), ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఇరాల), బీఎన్‌ఆర్‌పేట (చిత్తూరు), నల్లేపల్లి (జి.డి.నెల్లూరు).  

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)