amp pages | Sakshi

పోలవరంలో మరో కీలక ఘట్టం పూర్తి 

Published on Mon, 02/22/2021 - 07:46

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. స్పిల్‌ వేకు 192 గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియను రికార్డు సమయం లో ప్రభుత్వం పూర్తి చేసింది. ఒక్కో గడ్డర్‌ బరువు 62 టన్నులు. ప్రపంచంలో సాగు నీటి ప్రాజెక్టుల స్పిల్‌ వేల్లో ఇంత బరువైన గడ్డర్లను వినియోగించ డం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా 1,128 మీటర్ల పొడవుతో స్పిల్‌ వేను నిర్మిస్తున్నారు. స్పిల్‌ వేకు 49 పిల్లర్లను (పియర్స్‌) 52 మీటర్ల ఎత్తున ఇటీవల ప్రభుత్వం రికార్డు సమయంలోనే పూర్తి చేసింది.

తాజాగా వాటిపై గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియ 
పూర్తయ్యింది. గడ్డర్ల మధ్య షట్టరింగ్‌ స్లాబ్‌ వేసి స్పిల్‌ వే బ్రిడ్జిని నిరి్మంచాలి. స్పిల్‌ వే బ్రిడ్జిపై ఏర్పాటుచేసే హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా గేట్లను ఎత్తడం, దించడం చేస్తారు.

ఒక్కో గడ్డర్‌కు 10 టన్నుల స్టీల్‌ 
స్పిల్‌ వేకు 49 పిల్లర్ల మధ్య 192 గడ్డర్లు ఉంటాయి. ఒక గడ్డర్‌ తయారీకి పది టన్నుల స్టీల్, 25 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వినియోగించారు. గత సర్కార్‌ హయాంలో ఒక్క గడ్డర్‌ను కూడా తయారు చేయలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక   స్పిల్‌ వే పిల్లర్లను 52 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసి, వాటి మధ్య గడ్డర్లు, షట్టరింగ్‌తో స్పిల్‌ వే బ్రిడ్జి నిర్మించే పనులను ప్రణాళికా బద్దంగా చేపట్టింది. గతేడాది ఫిబ్రవరి 17న గడ్డర్ల తయారీని ప్రారంభించింది. 192 గడ్డర్ల తయారీకి 1,920 టన్నుల స్టీల్, 4,800 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించింది. పిల్లర్లపై గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియ గతేడాది జూలై 6న ప్రారంభించింది.

కరోనా, వరద ఉధృతి అడ్డంకిగా మారినా లెక్క చేయకుండా పనులు కొనసాగించి శనివారం రాత్రి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. కేవలం ఏడు నెలల్లోనే గడ్డర్ల ప్రక్రియ పూర్తి అయ్యిందన్నమాట. మరోవైపు 1,105 మీటర్ల పొడవున ఇప్పటికే స్పిల్‌ వే బ్రిడ్జిని ప్రభుత్వం పూర్తి చేసింది. మిగిలిన 23 మీటర్ల స్పిల్‌ వే బ్రిడ్జి పనులను ఈనెల 25 నాటికి పూర్తి చేస్తామని  అధికారవర్గాలు వెల్లడించాయి. మే నాటికి స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ను పూర్తి చేసి.. జూన్‌లో గోదావరికి వచ్చే వరదను స్పిల్‌ వే మీ దుగా మళ్లించి, 2022 ఖరీఫ్‌ నాటికి  ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు.

గడ్డర్‌ అంటే.. 
గడ్డర్‌ అంటే కాంక్రీట్‌ దిమ్మె. దీనిని రెండు పిల్లర్ల మీద అటువైపు రెండు, ఇటువైపు రెండు ఏర్పాటు చేస్తారు. గడ్డర్ల మధ్య ఇనుప చువ్వల షట్టరింగ్‌తో కాంక్రీట్‌ స్లాబ్‌ వేస్తారు. ఈ విధంగా 49 పిల్లర్ల మధ్య వేస్తే స్పిల్‌వే బ్రిడ్జి రెడీ అవుతుంది. 
గడ్డర్‌ పొడవు-23 మీటర్లు 
ఎత్తు-2 మీటర్లు 
బరువు-62 టన్నులు
చదవండి: 2022 నాటికి పోల‌వ‌రం పూర్తి: ఏబీ పాండ్యా
 నడిరోడ్డుపై విజయవాడ టీడీపీ నేతల రచ్చ
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)