amp pages | Sakshi

పెళ్లి సెలవులో అమ్రపాలి..

Published on Wed, 02/07/2018 - 15:30

సాక్షి, హన్మకొండ : వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి కాట ఈనెల 15 నుంచి మార్చి 7 వరకు వ్యక్తిగత కారణాలతో సెలవులో వెళ్తున్నారు. ఈ మేరకు 21 రోజులు సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17న కలెక్టర్‌ అమ్రపాలి కాటకు 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సమీర్‌శర్మతో వివాహం నిశ్చమైన నేపథ్యంలో సెలవులో వెళ్లనున్నారు. 21 రోజుల సెలవు కాలంలో.. ఈ నెల 16 నుంచి 21 వరకు జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర సందర్శన, 22 నుంచి 25 వరకు హైదరాబాద్, వరంగల్‌లలో, 26 నుంచి మార్చి 7 వరకు టర్కీ దేశాన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ నెల 18న జమ్ముకశ్మీర్‌లో సమీర్‌శర్మతో ఆమ్రపాలి వివాహం ఘనంగా జరగనుంది. అనంతరం 22న వరంగల్, 25 న హైదరాబాద్‌లో ఆమ్రపాలి తన సన్నిహితులకు విందు ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత 26 నుంచి మార్చి 7 వరకు భర్త సమీర్‌తో కలిసి ఆమ్రపాలి టర్కీ పర్యటన వెళ్లనున్నట్టు సమాచారం.

జేసీలకు ఇన్‌చార్జి బాధ్యతలు

ఇలా ఉండగా ప్రస్తుతం అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి రూరల్‌ జిల్లాకు ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌గా ఉన్నారు. ఆమె సెలవులో వెళ్తుండడంతో అర్బన్‌ కలెక్టర్‌గా జేసీ ఎస్‌.దయానంద్, రూరల్‌ కలెక్టర్‌గా జేసీ హరితకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. సెలవుల అనంతరం కలెక్టర్‌ అమ్రపాలి అర్బన్‌ కలెక్టర్‌గా, రూరల్‌ ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)