amp pages | Sakshi

షాకింగ్‌: ఉబర్‌ డ్రైవర్‌ ఖాతాలో 7కోట్లు!

Published on Fri, 12/23/2016 - 12:07

  • హైదరాబాద్‌లో వెలుగుచూసిన వైనం

  • హైదరాబాద్‌: నగరానికి చెందిన ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌ ఖాతాలో ఏకంగా రూ. 7 కోట్ల నగదు డిపాజిట్‌ అవ్వడం కలకలం రేపుతోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత భారీమొత్తంలో నగదు డిపాజిట్‌ అయిన ఖాతాలపై ఆదాయపన్ను (ఐటీ) అధికారులు నజర్‌ పెట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఐటీ దర్యాప్తు విభాగం అధికమొత్తంలో డిపాజిట్‌ అయిన ఖాతాలపై దృష్టిపెట్టగా.. ఉబర్‌ డ్రైవర్‌కు చెందిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) ఖాతాలో రూ. 7 కోట్లు వెలుగుచూడటం వారిని బిత్తరపోయేలా చూసింది.

    నవంబర్‌ రెండోవారంలో రద్దైన రూ. 500, వెయ్యి నోట్ల రూపంలో ఈ నగదు డిపాజిట్‌ అయింది. ఉబర్‌ డ్రైవర్‌ ఖాతా అంతకుముందు పెద్దగా క్రియాశీలంగా ఉండేది కాదని, కానీ నోట్ల రద్దు తర్వాత అతని ఖాతాలో డిపాజిట్‌ అయిన రూ. 7 కోట్లు దశలవారీగా ఒక బంగారు వర్తకుని ఖాతాకు బదిలీ అయిందని అధికారులు గుర్తించారు. దీనిపై సదరు డ్రైవర్‌ను ఐటీ అధికారులు విచారించగా.. నగదు ఎలా వచ్చింది, దానిని ఎందుకు ట్రాన్స్‌ఫర్‌ చేశారనే దానిపై అతను సరైన కారణాలు తెలుపలేదని అధికారులు తెలిపారు. బ్యాంకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. డబ్బు డిపాజిట్‌ చేసే సమయంలో ఇద్దరు వ్యక్తులు అతనితోపాటు వచ్చినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. వారిని కూడా పట్టుకొని వివరాలు ఆరాతీశారు.

    కాగా, పెద్దమొత్తంలో డిపాజిట్‌ అయిన ఈ డబ్బుకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై)కింద పన్ను కట్టేందుకు క్యాబ్‌ డ్రైవర్‌ అంగీకరించాడని, మొత్తం ఏడు కోట్లలో పన్ను, పెనాల్టీ కింద రూ. 3.5 కోట్లు కట్టాల్సి ఉంటుందని, మరో 25శాతం పీఎంజీకేవై పథకంలో నాలుగేళ్లపాటు లాకిన్‌ డిపాజిట్‌గా ఉంచాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.     
     

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)