amp pages | Sakshi

ఎన్డీఏకు దూరమవుతున్నమిత్రపక్షాలు!

Published on Tue, 09/30/2014 - 18:18

న్యూఢిల్లీః ఎన్డీఏకు మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయి. ఎన్డీఏతో ఉన్న 18 ఏళ్ల అనుబంధాన్ని జేడీయూ సార్వత్రిక ఎన్నికలకు ముందే తెగతెంపులు చేసుకోగా..  హర్యానాలోని జనహిత్ కాంగ్రెస్ సాధారణ ఎన్నికల తర్వాత మైత్రీ బంధాన్ని తెంచుకుంది. హర్యానాలో బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ), ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్డీ)తో పొత్తు కుదుర్చుకుని బీజేపీ షాకిచ్చింది. ఇదిలా ఉండగా ఎన్డీఏకి సారథ్యం వహిస్తున్నబీజేపీతో మైత్రికి తాజాగా శివసేన కూడా స్వస్తి చెప్పింది. మహారాష్ట్రలో బీజేపీతో చెలిమి చెడడంతో కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగాలని శివసేన నిర్ణయించింది. ఎన్డీఏ సర్కారులో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న తమ పార్టీ నేత అనంత్ గీతే పదవి నుంచితప్పుకుంటారని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అనంత్ గీతే మంత్రి పదవికి రాజీనామా చేస్తారని వెల్లడించారు. 

 

మోడీ ప్రభుత్వంలో శివసేన తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక మంత్రి అనంత్ గీతే. వచ్చే నెలలో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో బీజేపీ, శివసేన వేరుబాట పట్టాయి. మహారాష్ట్రలో ఎన్నికలు సమీపిస్తున్నా.. రాష్ట్రంలో బీజేపీ నాయకుడ్ని ప్రకటించకుండా ఆ పార్టీ గందరగోళంలో కొట్టుమిట్టాడుతోంది. ఇందుకు కారణం శివసేనతో పొత్తు వైఫల్యం చెందడమే ప్రధాన కారణం. దీనిపై పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇక్కడ బీజేపీ నుంచి కెప్టెన్ ఎవరూ లేకపోవడాన్నిఅవార్డు గ్రహీత,  గోవా బీజేపీ నాయకుడు విష్ణు వాగ్ ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎన్డీఏ నుంచి మిత్రపక్షాలు దూరం కావడంతో బీజేపీ నేతల్లో అలజడి ఆరంభమైంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నమోదీ వచ్చేదాకా పార్టీలో ఏర్పడ్డ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడేటట్లు కనబడుటలేదు.

Videos

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్...కేసు నమోదు చేసిన ఈడీ

ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుంది: సీఎం జగన్

ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్

కుప్పంలో కోట్లు కుమ్మరించినా చంద్రబాబుకు ఓటమి ?

సాయంత్రం గవర్నర్ ను కలవనున్న YSRCP నేతల బృందం

రాష్ట్ర విభజన పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ ఫోకస్

Photos

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)