మోనికా డోగ్రా నవ్వుల పాలు

Published on Tue, 06/30/2015 - 16:09

భారత సంతతికి చెందిన అమెరికా ఎలక్ట్రానిక్ రాక్‌బాండ్ సింగర్, దోభీఘాట్ బాలీవుడ్ సినిమాలో నటించిన హీరోయిన్ మోనికా డోగ్రా... ఫేస్‌బుక్ లాంటి సామాజిక వెబ్‌సైట్లలో నవ్వుల పాలవుతున్నారు. లెస్బేనియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ (ఎల్‌జీబీటి) హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం ప్రముఖ అంతర్జాతీయ కళాకారులతో ఆర్ట్ వీడియో ఆల్బమ్ తీస్తానని, అందుకు 50 లక్షల రూపాయలు కావాలంటూ మిత్రులకు, అభిమానులకు ఫేస్‌బుక్ ద్వారా విజ్ఞప్తి చేయడమే అందుకు కారణం. దిక్కూ దివాణం లేకుండా భారత్‌లో అడుగుపెట్టిన తనను భారత ప్రజలు ఎంతో ఆదరించారని, తన పాటను అక్కున చేర్చుకున్నారని ఆమె తెలిపారు.

ఏదో వెలితి తనను తొలుస్తూ వచ్చిందని, అందులో నుంచే సామాజికంగా ఏదో చేయాలనే తలంపు పుట్టుకొచ్చిందని అన్నారు. అందుకనే ఆర్ట్ వీడియో ప్రాజెక్టును చేపడుతున్నానని చెప్పారు. 'ఫీల్ ది షివర్' పేరిట ఆమె ఫేస్‌బుక్‌లో చేసిన విజ్ఞప్తి ఇప్పుడు ఆమెకే షివర్ తెప్పిస్తోంది. 'ఓ ముద్దుగుమ్మా విరాళాలు అడగాల్సింది ఇలా కాదు. ఓ 1500 రూపాయలిస్తే మీతోని షాపింగ్ చేస్తానని, లేదా హోటల్‌కొచ్చి టీ తాగుతానని ఆహ్వానించాలి. అప్పుడు ఫలితం ఉంటుంది' అని తుంటరి సలహాలు ఆమెకు ఎక్కువయ్యాయి. మరికొంత మంది ఆకతాయిలు ఇంతకన్నా విపరీతమైన సలహాలే ఇస్తున్నారు. దీంతో మోనికా మిత్రులకు కోపం వచ్చింది. వారు సామాజిక వెబ్‌సైట్లలో కయ్యానికి దిగారు. 'మీకు విలువలు లేవా? మీరు ఎలాంటి సమాజంలో బతుకుతున్నారు' అంటూ పెద్ద పెద్ద ప్రశ్నలేవేస్తున్నారు. వీరి విషయం ఇలా ఉంచితే మోనికా ఉద్దేశాన్ని సూటిగా, నిజాయితీగా ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు.

'ఎల్‌జీబీటీ' హక్కుల కోసం పోరాడాలన్న మీ సహృదయానికి జోహార్లు. వారి పట్ల మీలాంటి సెలబ్రిటీకి సానుభూతి ఉన్నందుకు థ్యాంక్స్. మీరు మీ వీడియో అల్బమ్ ద్వారా ఎలా సాయపడగలరన్నది మొదటి ప్రశ్నయితే, అసలు మీరు వసూలు చేసే రూ. 50 లక్షలు సామాజిక ప్రయోజనం కోసమే ఖర్చు పెడతారా అన్నది అసలు ప్రశ్న అని కొందరు వ్యాఖ్యానించారు. అంత సామాజిక స్పృహ ఉంటే సొంత డబ్బు ఖర్చుపెట్టాలమ్మా అంటూ మరొకరి సలహా. ఏదైనా ఆమె యాభై లక్షల రూపాయల టార్గెట్‌లో మంగళవారం నాటికి ఆమెకు రూ. 2,46,360 విరాళాలు వచ్చాయి. మరో 37 రోజుల్లో టార్గెట్‌ను అందుకోవాలన్నది ఆమె టార్గెట్.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ