amp pages | Sakshi

ప్రాణంమీదకు తెచ్చిన పెళ్లి ఫొటోలు

Published on Wed, 07/27/2016 - 20:14

రేక్ జవిక్: వెరైటీగా ఉంటుందనుకున్న వెడ్డింగ్ ఫొటో షూట్ కాస్తా వధువు ప్రాణాలమీదకు తెచ్చిన సంఘటన ఐస్ లాండ్ లో చోటుచేసుకుంది. చైనాకు చెందిన ఓ కొత్త జంట పెళ్లిఫొటోలు తీయాల్సిందిగా ప్రపంచంలో బెస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లలో ఒకరైన సీఎం లెంగ్ ను కోరారు. ఆమేరకు అందరూ కలిసి ఐస్ లాండ్ కు వెళ్లారు. వివిధ పర్యాటక ప్రాంతాలు, రమణీయ ప్రదేశాల్లో వధూవరులను వివిధ భంగిమల్లో ఫొటోలు తీశాడు లెంగ్. ఆఖర్లో ఓ నదీతీరంలో జరిగిన ఫొటోషూట్ మాత్రం ప్రమాదకరంగా మారింది.

నదీ తీరంలో హెలికాప్టర్ బ్యాగ్రౌండ్ లో ఫొటో తీయాలనుకున్న లెంగ్.. ఐర్లాండిక్ కోస్టల్ గార్డ్ హెలికాప్టర్ ఒకదానిని అద్దెకు తీసుకున్నాడు. పాల నురగలాంటి పెళ్లి దుస్తుల్లో వెయిల్ పట్టుకుని నిల్చున్న పెళ్లి కూతురుపై నుంచి హెలికాప్టర్ వెళుతుండగా ఫొటోలు చిత్రీకరించాల్సిఉంది. అయితే హెలికాప్టర్ సరాసరి తలపైకి వచ్చేసరికి..  రెక్కల గాలి ఉధృతికి వధువు చిగురుటాకులా వణికి, కిందపడబోయింది. ఆమె ధరించిన వెయిల్ అమాంతం ఎగిరి హెలికాప్టర్ రెక్కల్లో ఇరుక్కుంది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఘోరప్రమాదం తప్పినట్లైంది. ముఖాన దుమ్ము, చెరిగిన జుట్టుతో  ఆ పెళ్లికూతురికి ఏడుపొక్కటే తక్కువ! ఇంతటి ప్రమాదకర స్థితిలోనూ అద్భుతమైన ఫొటోలు తీసీ కొత్తజంట కోపాన్ని సంతోషంగా మార్చేశాడు ఫొటోగ్రాఫర్ సీఎం లెంగ్. వాటితోపాటు అతను తీసిన ఫొటోలు కొన్ని మీకోసం..

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)