amp pages | Sakshi

చైనాకు ‘చెప్పు దెబ్బ’ పడాల్సిందే..!

Published on Sun, 08/13/2017 - 14:49

- ప్రపంచ శాంతి,సామరస్య సమ్మేళనంలో బాబా రాందేవ్‌
- బౌద్ధగురువు దలైలామాతో ఫన్నీ మూమెంట్‌.. వీడియో వైరల్‌


ముంబై:
భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతోన్న చైనాను ఉద్దేశించి ప్రముఖ యోగా గురువు, పతంజలి సంస్థల వ్యవస్థాపకుడు బాబా రాందేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టిబెటన్‌ బౌద్ధగురువు దలైలామాతో కలిసి.. ఆదివారం ముంబైలో జరిగిన ప్రపంచ శాంతి, సామరస్య సమ్మేళనంలో రాందేవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురిమధ్య ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది.

చైనాకు అలానే చెప్పాలి : ‘చైనాకు శాంతి, సామరస్యం అంటే ఏమిటో తెలియదు. ఒకవేళ తెలిసుంటే, దలైలామా ఇక్కడ(ఇండియాలో) ఆశ్రయం పొందాల్సిన అవసరమే వచ్చేదికాదు. అందుకే ఇండియా.. చైనాతో ‘కుక్క కాటుకు చెప్పుదెబ్బ’ అన్నట్లుగా వ్యవహరించాలి. యోగా లాంటి శాంతియుత పద్ధతుల్లో నచ్చచెప్పితే అర్థం చేసుకోలేనివాళ్లకు యుద్ధంతోనే సమాధానం చెప్పాలి’ అని రాందేవ్‌ అన్నారు.

దలైలామా ఉద్బోధ: ప్రపంచంలో అశాంతికి కారణం హింసావాదమేనని బౌద్ధగురువు దలైలామా అన్నారు. ‘భయం విసుగును పుట్టిస్తుంది. విసుగువల్ల కోపం జనిస్తుంది. ఆ కోపం మనిషిని హింసవైపునకు నడిపిస్తుంది. కాబట్టి ప్రజలంతా భయం లేకుండా జీవించాలి’ అని లామా అన్నారు.