amp pages | Sakshi

ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి కన్నుమూత

Published on Mon, 06/12/2017 - 09:12

హైదరాబాద్‌: ప్రముఖ తెలుగు కవి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి. నారాయణరెడ్డి(85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 
 
కరీంనగర్‌ జిల్లా హనుమాజీపేటలో జన్మించిన సింగిరెడ్డి నారాయణరెడ్డి.. సినారెగా సాహితీలోకంలో తనదైన ముద్రలు వదిలివెళ్లారు. నారాయణరెడ్డి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

1953లో ‘నవమి పువ్వు’ పేరుతో తొలి రచన చేసిన సి.నారాయణరెడ్డి.. 1962లో సినీరంగప్రవేశం చేసి దాదాపు మూడు వేల పాటలు రాశాలు. 1977లో పద్మ పురస్కారాన్ని అందుకున్న ఆయన.. 1978లో కళాప్రపూర్ణ, 1988లో విశ్వంభర కావ్యానికిగానూ ప్రఖ్యాత జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. 1992లో పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని పొందారు. 1997లో రాజ్యసభ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు.