ఎయిడ్స్‌ కు మందు కనిపెట్టిన వైద్యుడిపై దాడి

Published on Sun, 04/23/2017 - 17:06

అహ్మదాబాద్‌: ఐసిస్‌ ఉగ్రవాదుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించిన ఓ డాక్టర్‌పై దుండగులు దాడిచేశారు. హెచ్‌ఐవీ చికిత్స కోసం తాను కనిపెట్టిన మందుకు అమెరికా నుంచి పేటెంట్‌ హక్కుల్ని పొందానని చెప్పుకుంటున్న డాక్టర్‌ ముఖేశ్‌ శుక్లాపై శనివారం దాడిచేసిన దుండగులు రసాయనం చల్లి రూ.24,000 నగదును దోచుకెళ్లారు.

తాను కనిబెట్టిన మందు ఫార్ములా చెప్పాలని, లేదంటే చంపేస్తామని ఐసిస్‌ ఉగ్రవాదుల నుంచి అరబిక్‌లో హెచ్చరిక లేఖ అందినట్లు శుక్లా ఇంతకుముందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి రోజూ పన్నెండు గంటల పాటు(ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు) ఆయనకు పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.

దాడి ఘటనపై సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ డీజే వాఘేలా మాట్లాడుతూ, శుక్లా ఒంటరిగా బైక్‌పై ఇంటికి వెళుతుండగా దాడి జరిగిందని తెలిపారు. గుర్తుతెలియని ముగ్గురు నిందితులపై ఐపీసీ 328, 394 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ