amp pages | Sakshi

ఇక కోకా-కోలా కాఫీ, పాలు కూడా..!

Published on Sat, 07/16/2016 - 13:56

ప్రపంచంలోనే సుప్రసిద్ధ కూల్ డ్రింక్ బ్రాండ్ గా విశేష ప్రాచుర్యం పొందిన కోకా-కోలా... తన బ్రేక్ ఫాస్ట్ పానీయాలను విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కాఫీ, మిల్క్ పానీయాలను తమ పోర్ట్ ఫోలియోలో బ్రేక్ ఫాస్ట్ ప్రొడక్ట్ లుగా అందించాలనుకుంటోంది. ప్యాకేజ్డ్ అరబికా కాఫీ బీన్స్ ను బ్రెజిలియన్ కన్సూమర్లకు అందించేందుకు ప్రయత్నిస్తోంది. అట్లాంటాకు చెందిన ఈ కంపెనీ, స్థానిక టీ బ్రాండ్ లీయో పేరుతో ప్యాకేజ్డ్ బీన్స్ అమ్మకాలు నిర్వర్తించనుందని కోకా కోలా బ్రెజిల్ యూనిట్ గురువారం ప్రకటించింది. బీన్స్ ను కొనుగోలు చేసి, రోస్ట్ చేయడానికి కాఫీ ఎగుమతిదారి ట్రీస్టో కాంపానిహా డి కమర్సియో ఎక్స్ టీరియర్ తో కోకా-కోలా భాగస్వామ్యం కుదుర్చుకుంది. అయితే ఈ డీల్ కు సంబంధించిన ఎలాంటి వివరాలను కంపెనీ  వెల్లడించలేదు.


కోకా-కోలా దశాబ్దన్నర క్రితం నుంచి తన ప్రొడక్ట్ లను విస్తరించుకుంటూ వస్తుందని, జ్యూస్, టీ, మినరల్ వాటర్ వంటి వాటిని అందిస్తుందని బ్రెజిల్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ శాండోర్ హెగెన్ చెప్పారు. ప్రస్తుతం కాఫీ, మిల్క్ ఉత్పత్తులను కూడా తమ పోర్ట్ ఫోలియోలో బ్రేక్ ఫాస్ట్ ప్రొడక్ట్ లుగా చేర్చాలనుకుంటున్నామని పేర్కొన్నారు. బ్రెజిల్ లో పాల ఉత్పత్తుల తయారీదారి లాటిసినోస్ వర్దె క్యాంపొ కంపెనీ కొనుగోలు ప్రక్రియ చివరి దశకు వచ్చిందన్నారు. ప్రస్తుతం కాఫీ డ్రికర్స్ పై ఎక్కువగా దృష్టిసారిస్తున్న కంపెనీ, ఎక్స్ క్లూజివ్ గా అరబికా కాఫీని వారికి అందించాలని ప్లాన్ చేస్తోంది. అరబికా కాఫీని తయారుచేయడంలో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉంది.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌