'క్షమించండి.. కానీ అది సంస్థ నిర్ణయం కాదు'

Published on Fri, 10/09/2015 - 10:57

వాషింగ్టన్: వినియోగదారులను మోసగించినందుకు అమెరికాలో వోక్స్ వ్యాగన్ గ్రూపు సీఈవో మైకేల్ హార్న్  క్షమాపణలు చెప్పారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించేలా సాఫ్ట్వేర్ ను డీజిల్ కార్లలోవాడినందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. యూఎస్ హౌస్ ఎనర్జీ, కామర్స్ సబ్ కమిటీ ఎదుట ఆయన హాజరయ్యారు. సాఫ్ట్వేర్ వాడకం సంబంధించి తనకు ముందస్తు సమాచారం లేదని హార్న్ కమిటీకి వివరించారు. కాగా ఈ సాఫ్ట్వేర్ను వాడాలన్నది తమ నిర్ణయం కాదని, దీన్ని రూపొందించిన నిపుణులే బాధ్యులని హార్న్ చెప్పారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏ కారణంతోనే ఈ సాఫ్ట్వేర్ను తయారు చేశారని తెలిపారు.  


వోక్స్ వాగన్ ప్రపంచవ్యాప్తంగా 1.1 కోట్ల డీజిల్ కార్లకు ఒకే రకమైన సాఫ్ట్వేర్ వాడి కస్టమర్లను మోసం చేసినట్లు అంగీకరించిన సంగతి తెలిసిందే.  తొలుత అమెరికాలోని 5లక్షల కార్లలో మాత్రమే లోపాలున్నట్లు తెలిపిన సంస్థ యాజమాన్యం ఆ తర్వాత భారీ మోసాన్ని అంగీకరించింది. 2009-2015 మధ్య ఈ రకం మోడల్ కార్లను తయారు చేసింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ