amp pages | Sakshi

రిజర్వేషన్‌పై తీర్మానాలు వస్తే పరిశీలిస్తాం

Published on Sat, 12/20/2014 - 02:28

* బీసీ సంఘ నేతలతో కేంద్ర మంత్రులు

సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏపీ, తెలంగాణ అసెంబ్లీల నుంచి తీర్మానాలు వస్తే పరిశీలిస్తామని కేంద్ర సామాజికన్యాయ, సాధికారిత మంత్రి థావర్ చంద్ గెహ్లాట్, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ నుంచి తీర్మానాలు అందలేదని వారు స్పష్టీకరించారు.

ఇతర రాష్ట్రాల అసెంబ్లీల నుంచి కూడా తీర్మానాలు వస్తే రాజకీయంగా బీసీలకు బలం పెరుగుతుందని, ఈ విషయంలో బీసీ సంఘాలే చొరవ తీసుకోవాలని ఆ నేతల బృందానికి మంత్రులు సూచించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ నేతలు శుక్రవారం పార్లమెంటులో కేంద్ర మంత్రులు థావర్‌చంద్ గెహ్లాట్, అనంతకుమార్‌లతో సమావేశమయ్యారు. ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడం సహా బీసీలకు సంబంధించిన 15 డిమాండ్లను మంత్రులకు కృష్ణయ్య వివరించి వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు మాట్లాడుతూ కేంద్రంలో తాము అధికారం చేపట్టి ఆరునెలలే అయ్యిందని, దశలవారీగా బీసీల డిమాండ్లను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మిన్‌రాజు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ అనుబంధ సంఘాల నేతలు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)