amp pages | Sakshi

ఆమె.. అనాసక్తి

Published on Mon, 04/15/2019 - 08:19

సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికలపై సిటీజనులు అనాసక్తి చూపగా... అందులోనూ మహిళల ఓటింగ్‌ శాతం మరింత పడిపోవడం చర్చనీయాంశమైంది. నగరంలోని అన్ని నియోకజవర్గాల్లోనూ మహిళల ఓటింగ్‌ శాతం పురుషులతో పోలిస్తే తక్కువగా ఉండడం గమనార్హం. హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో మొత్తంగా 47.21 శాతం  పురుషులు ఓటు వేస్తే... మహిళల్లో కేవలం 42.12 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యల్పంగా యాకుత్‌పురాలో 34.76 శాతం, మలక్‌పేటలో 35.78 శాతం మహిళల ఓటింగ్‌ నమోదైంది. ఇక సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో పురుషుల ఓటింగ్‌ 53.73 శాతం నమోదైతే... మహిళల ఓటింగ్‌ 52.68 శాతానికే పరిమితమైంది.

నాంపల్లిలో అత్యల్పంగా 36.48 శాతం, సికింద్రాబాద్‌లో 42.12 శాతం ఓటింగ్‌ నమోదైంది. మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోనూ మహిళల ఓటింగ్‌ తక్కువగానే  నమోదైంది. ఈ నియోజకవర్గంలో పురుషుల ఓటింగ్‌ 50.20 శాతం, మహిళల ఓటింగ్‌ 48.81 శాతం. అత్యల్పంగా ఎల్బీనగర్‌లో 43.48 శాతం, ఉప్పల్‌లో 45.65 శాతం నమోదైంది. అయితే కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోకజవర్గాల్లో మాత్రమే పురుషులతో సమానంగా మహిళలు ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం. కూకట్‌పల్లిలో పురుషుల ఓటింగ్‌ 50.82 శాతం ఉండగా.. మహిళల ఓటింగ్‌ 50.62 శాతం. కుత్బుల్లాపూర్‌లో పురుషుల ఓటింగ్‌ 49.86 శాతం ఉండగా... మహిళల ఓటింగ్‌ 49.37 శాతం. ఇక చేవెళ్ల లోక్‌సభ పరిధిలో పురుషుల ఓటింగ్‌ 41.97 శాతం, మహిళల ఓటింగ్‌ 41.62 శాతం నమోదైంది. మహిళల ఓటింగ్‌ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడంతో ఆయా పార్టీల జయాపజయాలు, మెజారిటీల్లోనూ భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  

Videos

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌