మహిళ దారుణ హత్య

Published on Wed, 07/15/2015 - 23:18

దుండగులు ఓ గుర్తుతెలియని మహిళ ను దారుణంగా హత్య చేశారు. తల, మొండెం వేర్వేరుగా పడి ఉన్నాయి. హత్య అనంతరం మృతదేహాన్ని కాల్చివేశారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో నాలుగైదు రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కలకలం సృష్టించిన ఈ సంఘటన మండల పరిధిలోని తిమ్మాయిపల్లి అనుబంధ బండమీదిపల్లి శివారులో బుధవారం వెలుగు చూసింది.
- తల నరికేసిన దుండగులు
- మృతదేహాన్ని కాల్చివేసిన వైనం
- డాగ్‌స్క్వాడ్‌తో వివరాలు సేకరించిన సీఐ శివశంకర్
- యాలాల మండలం బండమీదిపల్లి శివారులో ఘటన
యాలాల:
స్థానికులు, తాండూరు రూరల్ సీఐ శివశంకర్  తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బండమీదిపల్లి గ్రామ శివారులోని ర్యాలబండ గుట్టలో ఉన్న లోయ ప్రాంతంలో పూర్తిగా కుళ్లిపోయి తల లేకుండా ఉన్న మహిళ మృతదేహాన్ని పశువుల కాపరులు గుర్తించారు. గ్రామ సర్పంచ్‌తో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. తాండూరు రూరల్ సీఐ శివశంకర్, ఎస్‌ఐ రమేష్ తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో హత్యకు జరిగి నాలుగైదు రోజులు అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళకు దాదాపు 35 ఏళ్ల వయస్సు ఉంటుందని భావిస్తున్నారు.

పోలీసులు పరిసరాలను పరిశీలించగా సమీపంలోని పొదల్లో మహిళకు సంబంధించిన తల కనిపించింది. దుండగులు హత్య అనంతరం మృతదేహంపై పెట్రోల్ లేదా కిరోసిన్ పోసి నిప్పంటించిన ఆనవాళ్లు కనిపించాయి. మృతదేహం సగం కాలిపోయింది. హతురాలి కుడి చేతిపై పచ్చబొట్టు ఉంది. చేతులకు రోల్డ్‌గోల్డ్ గాజులు ఉన్నాయి. సంఘటన స్థలానికి సమీపంలో మృతురాలికి చెందినవిగా భావిస్తున్న చెప్పులు, ఇంటికి సంబంధించిన తాళాలు పడి ఉన్నాయి. హతురాలిని గుర్తించే వీలులేకుండా పోయింది.

మహిళకు తెలిసిన వారే ఇక్కడికి తీసుకువచ్చి అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. అనంతరం జాగిలాలతో వివరాలు సేకరించారు. ఘటనా స్థలంలోనే మృతదేహాన్ని ఖననం చేశారు. కాగా బండమీదిపల్లి శివారులో మహిళను దుండగులు దారుణంగా హత్య చేయడంతో గ్రామస్తులు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ వీఆర్వో పాండు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివశంకర్ పేర్కొన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ