amp pages | Sakshi

హబ్.. కబ్?

Published on Mon, 07/27/2015 - 01:27

గజ్వేల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి శ్రీకారం చుట్టారు. నాబార్డు సహకారంతో నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో మూడేళ్లలో నాబార్డు కింద 2,500 యూనిట్ల డెయిరీ పథకాలను వర్తింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది డిసెంబర్ 24న గజ్వేల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు రైతులకు చెక్కులను సైతం పంపిణీ చేశారు. మొదటి ఏడాది 500, రెండో ఏడాది 1000, మూడో ఏడాది మరో వెయ్యి యూనిట్ల రైతులకు వర్తింపజేయాలని నిర్ణయించారు.

ఒక్కో యూనిట్ విలువ(రెండు ఆవులు లేదా గేదెలు) రూ.1.2లక్షలు ఉంటుంది. ఇందు కోసం బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు ఇస్తారు. సాధారణ రైతులకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 33.3 శాతం సబ్సిడీ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 25 వేల లీటర్ల పాలు ఉత్పత్తవుతుండగా... దానిని లక్ష లీటర్లకు పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కానీ మొదటి ఏడాదిగా భావించిన 2014లో కేవలం 200 మందికి మాత్రమే రూ.60 వేల చొప్పున చెక్కులను(మొత్తం రూ.1.2కోట్లు) పంపిణీ చేశారు.

నిజానికి  పంపిణీ చేసింది 200 యూనిట్లలో సగం మాత్రమే. ఈ ఏడాదిలో సగం గడిచిపోయినా ఇప్పటివరకు ఈ వ్యవహారంపై చడీచప్పుడు లేదు. గత ఏడాది యూనిట్లు పంపిణీ చేసిన రైతుల్లో చాలావరకు నాబార్డ్ నుంచి సబ్సిడీ అందక ‘స్త్రీనిధి’ నుంచి రుణాలు అందజేసినట్లు తెలిసింది. ‘గజ్వేల్ మిల్క్‌గ్రిడ్’ పథకం ముందకు సాగకపోవడానికి నాబార్డు, బ్యాంకర్ల సహకార లోపమే కారణంగా తెలుస్తున్నది. తాజాగా ఈసారి కూడా సబ్సిడీలు అందే పరిస్థితి కనిపించడంలేదు.
 
 ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు.. కానీ రూపాయి అందలేదు
 గతేడాది డిసెంబర్ 24న గజ్వేల్‌కు నన్ను పిలిచిండ్రు. బర్ల లోన్ రూ.60 వేలు వచ్చిందని ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు. కానీ ఇంతవరకు రూపాయి అందలే. బ్యాంకుకు ఈ ప్రొసీడింగ్ తీసుకొని వెళ్తే వాళ్లు పట్టించుకుంటలేరు. ఏడు నెలల నుంచి ఇంతే పరిస్థితి.
 - కుంట శ్రీనివాస్‌రెడ్డి, ఆహ్మాదీపూర్ గ్రామ రైతు
 
 మంత్రి దృష్టికి తీసుకెళ్లాం...
 ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి బడ్జెట్ సక్రమంగా కేంద్రం నుంచి రావటం లేదని వ్యవసాయశాఖ  మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఈ మేరకు మంత్రి కేంద్రానికి లేఖ రాశారు. కొద్ది రోజుల్లో బడ్జెట్ పెంపునకు అవకాశమున్నది. ప్రస్తుతం వచ్చిన బడ్జెట్‌తో పథకం కొనసాగుతుంది. గజ్వేల్ పథకానికి ఇబ్బంది ఉండదు.  
- రమేశ్ కుమార్, నాబార్డు ఏజీఎం

Videos

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)