amp pages | Sakshi

ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలు

Published on Wed, 10/14/2015 - 04:49

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలను, అమలు చేయని ఎన్నికల హామీలను వరంగల్ లోక్‌సభ, నారాయణఖేడ్ శాసనసభ ఉప ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా వాడుకోవాలని టీపీసీసీ భావిస్తోంది. ఆ దిశగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రావిర్భావం నుంచి ఇప్పటిదాకా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యాల జాబితాను రూపొం దిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రసంగాల రూపంలో ఎత్తిచూపడమే గాక ఇతరత్రా రూపాల్లో కూడా వాటిని వీలైనంత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా టీఆర్‌ఎస్, జేఏసీ అనుసరించిన ‘ఆట-పాట’ పద్ధతిని ఇందుకు ప్రధానంగా ఉపయోగించుకోనుంది.

దళితుడిని ముఖ్యమంత్రి చేయడం, రైతు రుణమాఫీ, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య, లక్ష ఉద్యోగాలు వంటి ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని ప్రచారం చేయడంతో పాటు, తద్వారా తలెత్తిన సమస్యలపై పాటల రచన ఇప్పటికే ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణకు తొలి సీఎం దళితుడే అని చెప్పి ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కె.తారక రామారావు, టి.హరీశ్‌రావు మంత్రులుగా, కూతురు కవిత ఎంపీగా పదవులు అనుభవిస్తున్నారంటూ పాటలు రూపొందిస్తున్నారు.

తెలంగాణలో లక్ష ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ వంటి హామీలను అమలుచేయకపోవడంపై ఇంకో పాటను రాస్తున్నారు.  పాటలు పూర్తవగానే సీడీలను రూపొందించనున్నారు. ఈ పాటలతో తెలంగాణ అంతటా  కళాజాతాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉప ఎన్నికల్లోనూ కళాజాతాలు నిర్వహించనున్నారు.

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)