amp pages | Sakshi

పంట రుణంపైనే మాఫీ

Published on Thu, 06/05/2014 - 00:24

ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : రైతులకు రుణమాఫీ విషయంలో టీఆర్‌ఎస్ సర్కారు స్పష్టమైన విధివిధానాలు జారీ చేయడంతో బ్యాంకర్లలో గందరగోళానికి తెరపడినట్లయింది. పంట రుణాలపైనే మాఫీ ఉంటుందని బుధవారం హైదరాబాద్‌లో బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి ఈటేల రాజేందర్ స్పష్టం చేశారు. వ్యవసాయం కో సం బంగారం తాకట్టు రుణాలపై రుణమాఫీ ఉండద ని తెలిపారు. 2013 జూన్ నుంచి ఇచ్చిన పంట రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో రు ణాలు తీసుకున్న కొంతమంది రైతులకు ఈ నిర్ణయం నష్టం చేకూర్చుతుంది. బకాయిలతో సంబంధం లేకుండా ఈ ఖరీఫ్‌కు కొత్త రుణాలు అందజేయాలని సర్కారు ఆదేశించడం రైతులకు సంతోషానిస్తోంది.

 రూ.లక్షలోపు..
 జిల్లాలో గత ఖరీఫ్, రబీలకు కలిపి పంట రుణలక్ష్యం రూ.1,656 కోట్లు నిర్ధేశించగా, రూ. 1,421 కోట్లు మా త్రమే రైతులకు పంపిణీ చేశారు. 3,16,542 మంది రైతులు ఇందులో ఉన్నారు. దీర్ఘకాలిక రుణాల కింద లక్ష్యం రూ.135 కోట్లు ఉండగా, రూ.114 కోట్లు అందజేశారు. వ్యవసాయం కోసం 10వేల మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి రూ.125 కోట్లు రుణాలు పొం దారు. కాగా, రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తామని టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే ఈ రుణమాఫీ దేనికి వర్తిస్తుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో బ్యాంకర్లలో గందరగోళం నెలకొంది. బంగారం తాకట్టు రుణాలకు కూడా ఇది వరిస్తుందా అనే దానిపై సందేహం నెల కొంది. అయితే బ్యాంకర్ల సమావేశంలో రూ.లక్షలోపు పంట రుణం తీసుకున్న వాటికే రుణమాఫీ వర్తిస్తుంద ని స్పష్టం చేశారు.

 జిల్లాలో 3,16,542 మంది రైతులు రూ.1421 కోట్లు పంట రుణాలు తీసుకోగా, అందులో 2/3 వంతు మంది రూ.లక్షలోపు రుణం తీసుకున్న వారిలో ఉంటారని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. ఈ లెక్కన 2లక్షలకుపైగా రైతులు రూ.లక్షలోపు రుణం సుమారు రూ.950కోట్లుగా పొందినట్లు అంచనా వేస్తు న్నారు. ఈ వివరాలను వచ్చే సోమవారంలోగా అందజేయాలని ఆదేశాలుండడంతో బ్యాంకర్లు ప్రస్తుతం వీ టిపై దృష్టి సారించారు. రూ.లక్షలోపు రుణం తీసుకు న్న వారి లెక్కలు సేకరిస్తున్నారు. 2013 జూన్ నుంచి రూ.లక్షలోపు పంట రుణం తీసుకున్న రైతులకు ఇదీ వర్తిస్తుందని చెప్పడంతో అంతకు ముందు అంటే ఏప్రి ల్ నుంచి జూన్ వరకు పంట రుణం పొందిన రైతుల కు ఈ నిర్ణయం అశనిపాతమైంది. అప్పటికే రూ.100 కోట్లకుపైగా పంట రుణాలను వేలాది మంది రైతులు తీసుకోవడం జరిగింది. రుణమాఫీ వీరికి వర్తించదు.
 
 ఊరట
 పంట రుణాలకు సంబంధించి గతేడాది మార్చిలో తీ సుకున్న రుణాలకు ఈ యేడాది మార్చి 31, గతేడాది జూన్‌లో తీసుకున్న వారికి ఈ యేడాది జూన్ 30 వర కు రుణం చెల్లించేందుకు గడువు విధించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలు రుణ మాఫీని ప్ర కటించడంతో ఈ ఏడాది రైతులు తీసుకున్న రుణం గ డువులోగా చెల్లించలేదు. ఎన్నికల్లో రుణమాఫీ హామీ ని కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేయడంతో రైతుల్లో దీనిపై హర్షం వ్యక్తమైంది. సహాజంగా కొంత మంది రైతులు తాము తీసుకున్న రుణం గడువులోగా చెల్లించ డం, ఆ తరువాత కొత్త రుణం పొందడం జరుగుతుం ది. అలాంటి వారే పదిశాతంలోపే రుణాలు చెల్లించిన ట్లు తెలుస్తోంది. మిగతా రైతులు రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

ప్రధానంగా 2013 ఖరీఫ్ సీజన్‌లో జూలై, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 67,490 హెక్టార్లలో 1,18,621 మంది రైతులు రూ. 61.25 కోట్లు  పంట నష్టం చవిచూశారు. ఆ తరువాత 2014 ఫిబ్రవరి, మార్చిలో ఆకాల వర్షాలు దీనికి తోడు వడగండ్లు కురవడంతో 4,107 హెక్టార్లలో 9,091 మంది రైతులు రూ. 2.63 కోట్లు నష్టం జరిగింది. 2014 మేలో ఆకాల వర్షం, వడగండ్ల కారణంగా 144 హెక్టార్లలో 317 మంది రైతులు రూ.13 లక్షల పంట నష్టం కలిగింది. ఇందులో ఫిబ్రవరి, మార్చికి సంబంధించి రూ. 2.63 కోట్లు పంట నష్టాన్ని సర్కారు రైతులకు మంజూరు చేసింది. అయితే జూలై, ఆగస్టుకు సంబంధించి పంట నష్టం ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే విధంగా ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

Videos

లండన్ కు చేరుకున్న సీఎం జగన్

వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?

తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం

థియేటర్ కు వచ్చిన వారం రోజుల్లోనే..ఓటీటీలోకి కృష్ణమ్మ మూవీ..

ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..

RCB vs CSK: ప్లే ఆఫ్స్‌ బెర్తుకై చావో రేవో

లక్నో విజయం.. ఓటమితో ముగించిన ముంబై!అట్టడుగున

బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..

ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు

చిన్నస్వామిలో కురిసేది సిక్సర్ల వర్షమే.. CSKకి ఇక కష్టమే..

Photos

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)