amp pages | Sakshi

కరువు జిల్లాగా ప్రకటించాలి

Published on Sat, 08/01/2015 - 00:12

డీసీసీ అధ్యక్షురాలు సునీత డిమాండ్
 
 నర్సాపూర్ : ‘జిల్లాలో వర్షాలు సరిపడా లేవు. వేసిన పంటలు ఎండిపోయాయి. పూర్తి స్థాయిలో సాగు చేసే పరిస్థితులు లేవు. ఈ దుర్భర పరిస్థితుల్లో మెదక్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి. రైతులందరినీ ఆదుకోవాలి’ అని డీసీసీ అధ్యక్షురాలు వి.సునీతారెడ్డి డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు రావడం లేదు. వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు పొంది సాగు చేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో పంటలు వేసిన రైతులకు ఆర్థిక సహాయం అందివ్వాలి. ప్రభుత్వం రుణమాఫీ పథకం సక్రమంగా అమలు చేయనందున బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదు. రుణమాఫీ పథకాన్ని ఎన్నేళ్లు అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాలి.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాదిరిగా గ్రామం ఒక యూనిట్‌గా పంటల బీమా అమలు చేయాలి. ప్రీమియం చెల్లించిన రైతులకు బీమా సొమ్ము ఇవ్వకుండా... వారిచ్చిన చెక్కులు వాపసు చేయడం ఎంతవరకు సమంజసం? అధికారుల తప్పిదంతో రైతులకు బీమా వర్తించకుండా పోయింది. సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్టిన మన ఊరు.. మన ప్రణాళిక ఏమైంది! దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు గ్రామ జ్యోతి తెస్తున్నారంటే... వారి పథకాలపై వారికే నమ్మకం లేదా’ అని సునీత ప్రశ్నించారు.  

 4న ధర్నా...
 ‘శాశ్వత గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు బిల్లులు చెల్లించలేదు. లబ్ధిదారుల ప్రయోజనాల దృష్ట్యా ఆగస్టు 4న పీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా చేయాలని నిర్ణయించాం. దీన్ని విజయవంతం చేయాలి’ అని సునీత చెప్పారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)