amp pages | Sakshi

కార్మికులను తయారుచేద్దాం!

Published on Sat, 05/09/2020 - 04:14

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సృష్టించిన సంక్షోభంతో పాఠాలు నేర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కార్మికులను తయారు చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. వలస కార్మికులు స్వరాష్ట్రాలకు తరలిపో తుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. కరోనా కల్లోలం ఇప్పట్లో సద్దుమణిగే సూచనలు కనిపించకపోవడం, సొంత రాష్ట్రాల బాట పట్టిన శ్రమజీవులు ఇప్పట్లో తిరిగి వచ్చే సంకేతాలు లేకపోవడంతో విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కే దిశగా ఆలోచనలు చేస్తోంది. భవిష్యత్తులోనూ పూర్తిస్థాయిలో వలస కార్మికులపై ఆధారపడకుండా.. స్థానిక మానవ వనరులు ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే వలస కూలీల స్థానాన్ని భర్తీ చేసుకునేందుకు స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి కార్మికుల రూపంలో అందుబాటులోకి తెచ్చుకోవాలని భావిస్తోంది.

మనవారికీ ఉపాధి కరువు..
కరోనా విశ్వరూపంతో ముంబై, సూరత్, గల్ఫ్‌ దేశాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న మన కార్మికులకు కూడా ఉపాధి కరువైంది. ఆర్థిక సంక్షోభంతో ఆనేక కంపెనీలు మూత పడుతున్నాయి. మరికొన్ని పరిశ్రమలు సిబ్బందిని కుదించుకుంటున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ ఎత్తేయగానే ఆయా ప్రాంతాల నుంచి వేలాది మంది తెలంగాణకు తిరిగి వస్తారని రాష్ట్ర సర్కారు అంచనా వేస్తోంది. వీరిలో అధికశాతం నైపుణ్యవంతులు కానందున.. ఇక్కడ ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి తలనొప్పి కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని సానుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వలస కూలీలు వెళ్లిపోవడంతో ఏర్పడిన లోటును భర్తీ చేసుకోవాలనుకుంటోంది. ఇందులో భాగంగా జాతీయ నిర్మాణ సంస్థ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌) లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవారితో పాటు స్థానిక యువతకు శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఐదుగురితో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు
లాక్‌డౌన్‌ సంక్షోభం ఏయే రంగాలపై ఎంత ప్రభావం చూపుతుంది? వలస కార్మికులు అధికంగా తరలి వెళ్లిన రంగాలేంటి? ఏయే రంగాల్లో అవకాశాలున్నాయనే అంశాలపై అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్ని అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

3 లక్షల మంది తిరుగుముఖం
లాక్‌డౌన్‌ కారణంగా పనుల్లేక సుమారు 3 లక్షల మంది వలస కార్మికులు స్వస్థలాలకు తరలి వెళ్లారు. మరికొందరు ప్రజా రవాణా పునరు ద్ధరించగానే వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుం టున్నారు. ఇలా తరలివెళ్లిన వారిలో అత్యధికులు భవన నిర్మాణ రంగానికి చెందిన కార్మికులే. రాష్ట్రంలో 16 లక్షల మంది కార్మికులు భవన నిర్మాణ సంక్షేమ మండలిలో నమోదు కాగా.. వీరికి అదనంగా మరో నాలుగైదు లక్షల మంది అనధికారికంగా పని చేస్తుంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

కరోనా మహమ్మారి ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది.  తాజాగా లాక్‌డౌన్‌లో నిర్మాణ రంగానికి సడలింపులు ఇచ్చినప్పటికీ కార్మికుల కొరత పీడిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అవలంభిస్తోంది. ఒకవైపు వలస కార్మికుల కొరతను అధిగమించేందుకు.. మరోవైపు గల్ఫ్, ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే వారికి ఉపాధి కల్పించేలా వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించడం ద్వారా నిష్ణాతులుగా తయారు చేయాలని నిర్ణయించింది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)