amp pages | Sakshi

ఆ పథకాల కోసం ప్రజాధనాన్ని వృధా చేయం!

Published on Mon, 09/09/2019 - 16:07

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణపై పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంపై ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నా.. సంక్షేమ పథకాలు యథాతథంగా కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు. గత ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. 2019-20 పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో సీఎం కేసీఆర్‌... మండలిలో ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టారు. అనంతరం శాసనసభ... శనివారానికి శాసనమండలి బుధవారానికి వాయిదా వేశారు.
చదవండి: తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్‌

ప్రజాధనాన్ని వృధా చేయదలుచుకోలేదు
కేంద్ర ప్రభుత్వ పథకాలపై తమకు పూర్తి అవగాహన వుందని, ప్రజలకు మేలు చేసే..కేంద్ర పథకాలను మాత్రమే రాష్ట్రంలో అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజలకు ప్రయోజనం కలిగించని కేంద్ర పథకాల కోసం ప్రజాధనాన్ని వృధా చేయదలుచుకోలేదని తేల్చి చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కంటే రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకంతోనే ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతోందని,  ఆరోగ్యశ్రీ ద్వారా 85 లక్షల 34వేల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుండగా.. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే మేలు జరుగుతుందని కేసీఆర్‌ వివరించారు. ఆరోగ్య శ్రీ కోసం ప్రస్తుత బడ్జెట్‌లో ఏడాదికి రూ. 1,336 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. 

మూలధన వ్యయం పెరిగింది!
తెలంగాణ ఏర్పాటు తర్వాత మూలధన వ్యయం పెరిగిందని, తమ ప్రభుత్వ విధానాలతో మూలధన వ్యయం పెరుగుతూ వస్తోందని తెలిపారు. జీడీపీ వృద్ధి రేటు 4.5 నుంచి 10.2 శాతానికి పెరిగిందన్నారు. ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు అయిందన్నారు. ఐటీ రంగంలో 11.5 శాతం, వ్యవసాయంలో 8.1 శాతం వృద్ధి నమోదయినట్టు చెప్పారు. ఐటీ ఎగుమతుల విలువ 100 శాతానికిపైగా పెరిగిందని, పారిశ్రామిక రంగంలో అదనంగా అభివృద్ధి సాధించామన్నారు. గత ఏడాదిన్నరగా దేశం తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోందని, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 5 శాతం అభివృద్ధి మాత్రమే నమోదైందని కేసీఆర్‌ తెలిపారు. ఆర్థిక మాంద్యం ఉందన్న విషయాన్ని గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయని, దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం​ తగ్గిందన్నారు. 

రైతుబంధు  యథాతథంగా కొనసాగుతుంది
వాహనాల కొనుగోలులో 10.6 శాతం తగ్గుదల కనిపిస్తోందని, విమానయాన రంగంపైనా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందని వెల్లడించారు. గూడ్స్‌ రైళ్ల బుకింగ్‌ కూడా తగ్గిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూపాయి పతనమైందని, డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.40కు పడిపోయిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నానని అన్నారు. మోటార్‌ వాహనాలు, ఎక్సైజ్‌ పాటు అన్ని రంగాల్లో ఆదాయం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పన్నేతర వ్యయం 29 శాతం తగ్గిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత పెట్టిందని వాపోయారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి తెలంగాణ కంటే దారుణంగా ఉందని వెల్లడించారు. రైతు బంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని కేసీఆర్‌ స్పష్టత నిచ్చారు. 

అందుకు చింతిస్తున్నాను..!
కేంద్ర విధానాలనే రాష్ట్రాలు అనుసరించాలే తప్ప మరో గత్యంతరం లేదని, అందుకు తెలంగాణ కూడా అతీతం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్టంలో ఉన్న ఈ పరిస్థితిలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వచ్చిందని చింతిస్తున్నానని అన్నారు. చేజారిపోతున్న వేల కోట్ల విలువైన భూమిపై ఇప్పుడు ప్రభుత్వానికి హక్కు వచ్చిందని, ఆ భూమిని దశల వారీగా విక్రయంచడం ద్వారా రాష్ట్రానికి అదనంగా ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)