amp pages | Sakshi

ఎస్వీటీఎస్ యాప్ ప్రారంభం

Published on Thu, 10/30/2014 - 01:03

  • చోరీ వాహనాన్ని గుర్తించేందుకు రూపొందించిన ప్రత్యేక యాప్ ఇది    
  •  రాష్ట్రంలోని అన్ని జిల్లాల సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులకు యాప్ సౌకర్యం
  • సాక్షి, సిటీబ్యూరో: చోరీ అయిన వాహనం రాష్ట్రంలో ని ఏ మూల రోడ్డు ఎక్కినా పోలీసులకు చిక్కడం ఖాయం... అలాంటి ఒక అస్త్రం బుధవారం పోలీసు శాఖ అమ్ముల పొదిలో చేరింది. అదే..స్టొలెన్ వెహికిల్ ట్రాకింగ్ సిస్టం (ఎస్వీటీఎస్) మొబైల్ యాప్. ఈ యాప్‌ను నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో మీడియా సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘హైదరాబాద్‌లో చోరీకి గురైన వాహనాలు ప్రస్తుతం 4500 వరకు ఉన్నాయి. ఒక చోట చోరీ చేసిన వాహనాలను మరో చోట దర్జాగా నడుపుతున్నారు. ఆయా జిల్లాల్లో వాహనాల తనిఖీ సమయంలో వాహనానికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో కేవలం చలానా విధించి వదిలేస్తున్నారు. అయితే ఈ యాప్ ద్వారా ఇక నుంచి పాత పద్ధతులకు స్వస్తి పలుకుతారు. తనిఖీల సమయంలో వాహనదారుడి వద్ద  డాక్యుమెంట్లు ఉన్నా.., లేకపోయినా రిజిస్ట్రేషన్, ఇంజిన్, ఛాసిస్ నెంబర్లను పోలీసులు తమ వద్ద ఉన్న  మొబైల్ ఫోన్‌లోని ఎస్వీటీఎస్ మొబైల్ యాప్‌లో ఎంటర్ చేస్తారు.

    అలా చేయగానే క్షణాల్లో ఆ వాహనం చోరీ అయిందా? లేదా అనే విషయం తెలిసిపోతుంది. ఈ యాప్  చోరీ వాహనాలను వెంటనే పట్టుకొనేందుకు ఎంతో ఉపకరిస్తుంది.  ఎస్వీటీఎస్‌ను ట్రాఫిక్, సీసీఎస్, లా అండ్ ఆర్డర్ విభాగాల పోలీసు అధికారులకు అందిస్తాం. రాష్ట్రంలోని ఎస్‌ఐ ఆపై స్థాయి అధికారి సెల్‌ఫోన్‌కు ఈ యాప్‌ను సమకూర్చుకునే సదుపాయం కల్పిం చాం. ఈ రోజు వరకు చోరీ అయిన వాహనాల వివరాలన్నీ సర్వర్‌లో నిక్షిప్తం చేశాం.

    ఉదాహరణకు హైదరాబాద్‌లో చోరీ అయిన వాహనం అదిలాబాద్‌లో తిరిగినా అక్కడి పోలీసు అధికారి ఈ యాప్‌ను ఉపయోగించి పట్టుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ద్వారా రెండు ఉపయోగాలున్నాయన్నారు. ఒకటి చోరీ వాహనాన్ని గుర్తించడం, రెండోది చోరీ అయిన వాహన వివరాలు యాప్‌లో పెట్టడం’’ అని అన్నారు.  సమావేశంలో అదనపు సీపీలు అంజనీకుమార్, స్వాతిలక్రా, జాయింట్ పోలీసు కమిషనర్ బి.మల్లారెడ్డి పాల్గొన్నారు.
     
    డేటా సేకరణలో ఐటీ సెల్...

    సర్వర్‌లో ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోరీ అయిన వాహనాల వివరాలు మాత్రమే పొందుపర్చా రు. సైబరాబాద్‌తో పాటు మరో తొమ్మి ది జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన చోరీ వాహనాల వివరాలను ఐటీ సెల్ అధికారులు సేకరిస్తున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల పోలీసు అధికారులకు వివరాలు పంపాల్సిందిగా కోరారు.
     

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)