amp pages | Sakshi

ఉద్యాన ఉత్పత్తుల్లో నాణ్యతే లక్ష్యం: పార్థసారథి

Published on Thu, 05/09/2019 - 04:42

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఉద్యాన నర్సరీల క్రమబద్ధీకరణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార ముఖ్య కార్యదర్శి, ఉద్యాన ఉత్పత్తుల కమిషనర్‌ సి.పార్థసారథి అన్నారు. ఉద్యాన పంటల్లో కల్తీ విత్తనాలు, నాణ్యతలేని నారు, మొక్కల సరఫరాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉద్యాన నర్సరీల క్రమబద్ధీకరణ నిబంధనలు–2017ను రూపొందించిందన్నా రు. నాంపల్లిలోని తెలంగాణ ఉద్యాన శిక్షణ సంస్థ (టీహెచ్‌టీసీ)లో బుధవారం రాష్ట్రంలోని మిరప, కూరగాయల నర్సరీల యజమానులకు క్రమబద్ధీకరణ నిబంధనలపై అవగాహనకోసం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఉద్యాన నర్సరీల్లో కల్తీ విత్తనాలు, కల్తీ నారును నిరోధించేందుకు ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టామన్నారు.

కల్తీ నిరోధించ డం లక్ష్యంగా రాష్ట్ర స్థాయిలో పోలీసు, వ్యవసాయ అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలి పారు. నర్సరీల్లో విస్తృత తనిఖీలు నిర్వహించి, కల్తీ ఉత్పత్తి, అమ్మకందారులపై దాడులు నిర్వహించాలని ఆదేశించామన్నారు. కల్తీ నారు, విత్తనాలతో ఎకరాకు రూ.80 వేల నుంచి లక్ష రూపాయల వరకు రైతులు నష్టపోవడంతో పాటు, విలువైన సమయా న్ని కూడా కోల్పోయే అవకాశం ఉందన్నారు. నర్సరీల్లో అవకతవకలు, పొరపాట్లు జరగకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నర్సరీల్లో మెరుగైన మౌళిక సౌకర్యాలతో ఆరోగ్యవంతమైన మొక్కలను ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్‌ ఎల్‌.వెంకట్రాంరెడ్డి అవగాహన సదస్సులో సూచించారు.

ఉద్యానవన శాఖలో నర్సరీ యజమానులు తమ వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు, రికార్డుల నిర్వహణ సక్రమం గా ఉండేలా చూసుకోవాలన్నారు. మొక్కల ఉత్పత్తి, అమ్మకంలో అవతవకలకు పాల్పడితే విత్తన, నర్సరీ చట్ట నిబంధనల మేరకు కేసులు నమోదు చేసి, చర్య లు తీసుకుంటామని తెలిపారు. నర్సరీల్లో రికార్డుల నిర్వహణ, విత్తన చట్టం, పీడీ యాక్టు నియమ నిబంధనలు తదితరాలపై ఉద్యాన శాస్త్రవేత్తలు అవగాహ న కల్పించారు. ఈ కార్యక్రమంలో విత్తన ధృవీకరణ సంస్థ ఎండీ కె.కేశవులు, వ్యవసాయశాఖ డిప్యూటీ డైరక్టర్‌ శివప్రసాద్, రాచకొండ కమిషనరేట్‌ సీఐ విజయ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)