హైదరాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

Published on Sat, 03/07/2015 - 02:21

విజయవాడ: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్-కాకినాడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనుందని విజయవాడ డివిజన్ సీనియర్ పౌరసంబంధాల అధికారి మైఖేల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07427 హైదరాబాద్ - కాకినాడ రైలు హైదరాబాద్‌లో మార్చి ఆరో తేదీ సాయంత్రం 6.45 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 5 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. ఇది విజయవాడకు అర్ధరాత్రి 1.30కు వచ్చి 1.45కు వెళ్తుంది.

 

రైలు నంబరు 07428 కాకినాడ-హైదరాబాద్ రైలు కాకినాడలో ఈ నెల ఏడో తేదీ రాత్రి 9.05 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.35 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఇది విజయవాడకు అదేరోజు అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి 2.10 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట మీదుగా వెళ్తుంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ