amp pages | Sakshi

కరోనా కట్టడికి ప్రత్యేక యాప్‌

Published on Mon, 03/30/2020 - 03:27

సాక్షి, హైదరాబాద్‌: కరోనా ప్రభావాన్ని కట్టడి చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించడం, బాధితులకు వైద్య సేవలు, లాక్‌డౌన్‌ నేపథ్యంలో తలెత్తుతున్న ఇబ్బందుల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల నడుమ మెరుగైన సమన్వయం సాధించడంతోపాటు బాధితుల గుర్తింపు, చికిత్స, కరోనాపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఐటీ సాంకేతికతతో డ్పాటు తీసుకోవాలని నిర్ణయిం చింది. పలు ఫీచర్లతో కూడిన ప్రత్యేక యాప్‌ను రూపొం దించడంపై ఐటీ విభాగం ఇప్పటికే కొంత పురోగతి సాధించింది. పది రోజుల్లో అందుబాటులోకి రానున్న ఈ యాప్‌ ద్వారా కరోనా బాధితుల గుర్తింపు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన వంటి అనేక చర్యలు సులభతరం కానున్నాయి. లొకేషన్‌ డేటా ఆధారంగా ఇప్పటివరకు ప్రభావితమైన వారు, వ్యాధి విస్తరణకు అవకాశం ఉన్న ప్రాంతాలు తదితర అంశాలను కూడా ఈ యాప్‌ ద్వారా తెలుసుకొనే వీలుంటుంది.

స్వీయ గృహ నిర్బంధంపై నిఘా...
ఐటీశాఖ రూపొందిస్తున్న కొత్త యాప్‌ ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ గృహనిర్బంధం ఎంత మేరకు పాటిస్తున్నారనే విషయం తెలుసుకొనే అవకాశం ఉంటుంది. వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా ఎప్పటికప్పుడు యాప్‌ ద్వారా వారి కదలికలు తెలుసుకొనేలా వీలుంటుందని ఐటీశాఖ వర్గాలు చెబుతున్నాయి. యాప్‌లోని ఈ–ఫ్రాప్‌ అనే హైపర్‌లింక్‌ ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారు, వారిలో కరోనా లక్షణాలతోపాటు వారి సాధారణ ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొనే వీలుంటుంది. ఇప్పటికే సామాజిక పించన్ల పంపిణీలో ఉపయోగిస్తున్న ఐటీ సాంకేతికత ‘రియల్‌ టైమ్‌ డిజిటల్‌ అథెంటికేషన్‌ ఆఫ్‌ ఐడెంటిటీ’ని ఈ యాప్‌లో వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించామని, మరో 10 రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని ఐటీశాఖ వర్గాలు వెల్లడించాయి.

స్టార్టప్‌ల ద్వారా వెంటిలేటర్ల తయారీ...
రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి విజృంభించినా అందుకు తగ్గట్లుగా వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. చికిత్సలో కీలకపాత్ర పోషించే వెంటిలేటర్ల తయారీతోపాటు కరోనా పరీక్ష కిట్ల తయారీపై దృష్టి సారించింది. వెంటిలేటర్లు, కిట్ల తయారీ బాధ్యతను రెండు స్టార్టప్‌ కంపెనీలకు అప్పగించినట్లు తెలిసింది. తక్కువ ఖర్చుతో తయారయ్యే వెంటిలేటర్లను ఇప్పటికే కాన్పూర్‌ ఐఐటీ రూపొందించి నమూనాను కూడా తయారు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్కువ ఖర్చుతో వెంటిలేటర్లు, పరీక్ష కిట్లను తయారు చేసే స్టార్టప్‌లను గుర్తించినట్లు సమాచారం.

Videos

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)