amp pages | Sakshi

రైల్వే జనరల్‌ టికెట్లు మరింత తేలిక! 

Published on Sun, 03/01/2020 - 03:00

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే జనరల్‌ టికెట్లు మరింత తేలిగ్గా లభించనున్నాయి. యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా వేగంగా టికెట్లను బుక్‌ చేసుకొనే సదుపాయాన్ని దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం యూటీఎస్‌ యాప్‌ నుంచి జనరల్‌ టికెట్లను బుక్‌ చేసుకొనే వెసులుబాటు ఉన్నప్పటికీ బుకింగ్‌ కోసం ఎక్కువ సమయం వెచ్చించవలసి వస్తోంది. దీంతో ప్రయాణికులు ఈ యాప్‌ వినియోగంపై ఆసక్తి చూపడంలేదు. దీన్ని దృష్టిలో ఉం చుకొని వేగంగా టికెట్లను బుక్‌ చేసుకునేందుకు క్విక్‌ రెస్పాన్స్‌ కోడ్‌ను ప్రవేశపెట్టారు. ఇది సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, హైటెక్‌ సిటీ, బేగంపేట్‌ తదితర అన్ని ప్రధాన స్టేషన్‌ల్లో అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర 18 రైల్వేస్టేషన్‌లలో యూటీఎస్‌ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా జనరల్‌ టిక్కెట్లను పొందే సదుపాయాన్ని దక్షిణమధ్య రైల్వే ప్రవేశపెట్టింది. దశలవారీగా అన్ని రైల్వేస్టేషన్‌లలోనూ క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల క్యూలైన్‌లలో పడిగాపులు కాయాల్సిన ఇబ్బం ది ఉండదని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా తెలిపారు.  

క్షణాల్లో టిక్కెట్‌..: ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వే పరిధిలో రోజూ 8.5 లక్షల నుం చి 9 లక్షల మంది రిజర్వ్‌డ్, అన్‌ రిజర్వ్‌డ్‌ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తు న్నారు. ఏసీ, నాన్‌ ఏసీ రిజర్వేషన్‌ బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీతో పాటు రిజర్వేషన్‌ కార్యాలయాల్లో బుకింగ్‌ సదుపాయం ఉంది. కానీ అప్పటికప్పుడు బయలుదేరే జనరల్‌ టికెట్ల కోసం ప్రయాణికులు రైల్వేస్టేషన్‌ల్లో కౌంటర్‌ల వద్ద పడిగాపు లు కాయాల్సిందే. పండుగలు, వరుస సెలవులు, వేసవి రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో తరచుగా రైళ్లు బయలుదేరే సమయం వరకు కూడా ప్రయాణికులు టికెట్లను తీసుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలో మూడేళ్ల క్రితం దక్షిణ మధ్య రైల్వే యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కానీ బుకింగ్‌ సమయంలో ఏ స్టేషన్‌ నుంచి ఏ స్టేషన్‌ వరకు అనే వివరాలతో పాటు, అనేక అంశాలను భర్తీ చేయవలసి వస్తోంది. దీంతో జాప్యం చోటుచేసుకుంటుంది. యూటీఎస్‌ను వినియోగించాలని ఉన్నప్పటికీ వివరాలను భర్తీ చేయడంపై ప్రయాణికులు నిరాసక్తతను ప్రదర్శిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు లక్ష మందికి పైగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పటికీ వినియోగించే వారి సంఖ్య 40 వేల నుంచి 50 వేల వరకు ఉంది. తాజాగా క్యూఆర్‌ కోడ్‌ను ప్రవేశపెట్టడం వల్ల ప్రయాణికులు స్టేషన్‌కు ఒక కిలోమీటర్‌ దూరం నుంచి స్టేషన్‌ వర కు ఎక్కడైనా సరే క్షణాల్లో టికెట్‌ పొందవచ్చు. అన్ని ప్రధాన స్టేషన్‌లలో ప్లాట్‌ఫామ్‌లు, ఏటీవీఎం సెంటర్‌లు, ప్రధాన ప్రాంగణాల్లో క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో యూటీఎస్‌ వినియోగదారుల సంఖ్య పెరుగుతుందని అంచనా.

అన్ని రకాల టికెట్లు తీసుకోవచ్చు..: యూటీఎస్‌–క్యూఆర్‌ సదుపాయంతో స్లీపర్, థర్డ్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, ఫస్ట్‌ ఏసీ వంటి రిజర్వ్‌డ్‌ టికెట్లు, వివిధ రకాల రా యితీ టికెట్లు మినహాయించి అన్ని రకాల జనరల్‌ టికెట్లను తీసుకోవచ్చు. ఎం ఎంటీఎస్, ప్లాట్‌ఫామ్‌ టికెట్లు పొందవచ్చు. వివిధ ప్రాంతాల మధ్య రెగ్యులర్‌ గా ప్రయాణం చేసేవారు నెలవారీ పాస్‌లను పొందవచ్చు. ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా జనరల్‌ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.    

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్