సింగరేణిలో ‘సోలార్‌’!

Published on Sun, 12/09/2018 - 12:38

సాక్షి, గోదావరిఖని(రామగుండం): సింగరేణి సంస్థలో సోలార్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు వడివడిగా అడుగులుపడుతున్నాయి. సంస్థ వ్యాప్తంగా నాలుగు సోలార్‌విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. రామగుండం, శ్రీరాంపూర్‌ పవర్‌ప్రాజెక్టు, ఇల్లెందు, మణుగూరులో సోలార్‌ విద్యుత్‌ప్లాంట్లను నెలకొల్పేందుకు ఇప్పటికే యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి. టెండర్ల పక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. రూ.600 కోట్ల వ్యయంతో మొదటి దఫాగా సింగరేణి సంస్థకు చెందిన ఖాళీ స్థలాల్లో 129 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లను నెలకొల్పనున్నారు. ప్రస్తుతం థర్మల్‌పవర్‌ విద్యుత్‌ కేంద్రాన్ని నిర్వహిస్తున్న యాజమాన్యం.. సోలార్‌ విద్యుత్‌ తయారీ కోసం ముందుకు సాగుతోంది.  

తొమ్మిది నెలల్లో పూర్తి.. 
వచ్చే ఏడాది జనవరిలో పనులు ప్రారంభమై సెప్టెంబర్‌ చివరినాటికి పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన టెండర్లు పక్రియ పూర్తికానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.  

అన్ని అనుమతులు పూర్తయ్యాయి
సోలార్‌ పవర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనుమతులు కూడా తీసుకున్నాం. టెండర్ల పక్రియ పూర్తయింది. త్వరలో ఎల్‌వన్‌కు టెండర్‌ కేటాయించనున్నాం. సెప్టెంబర్‌ చివరినాటికి నాలుగు ఏరియాలో ప్లాంట్ల నిర్మాణం పూర్తవుతుంది.  
– డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ చంద్రశేఖర్‌ 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ