సీజ్‌ చేస్తే సరోగసీ తల్లుల పరిస్థితేంటి?

Published on Fri, 06/23/2017 - 00:23

సాక్షి, హైదరాబాద్‌: సరోగసీ దందా చేస్తున్న ఆస్పత్రిపై దాడులు చేసి తాళాలు వేస్తే.. సరోగసీ ద్వారా గర్భం దాల్చి న తల్లి, కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటి అని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. చట్టాల ప్రకారం ఫెర్టిలిటీ ఆస్పత్రులు తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలి కానీ అద్దె గర్భం దాల్చిన వారి గురించి కూడా ఆలోచించాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సాయికృష్ణ హాస్పిటల్‌– కిరణ్‌ సంతాన సాఫల్య కేంద్రంపై పోలీసులు దాడి చేసి, సీజ్‌ చేసినట్లు వార్తా కథనాలను చదివిన న్యాయమూర్తి జస్టిస్‌ సురేశ్‌కుమార్‌ కెయిత్‌ తన ఆవేదనను లేఖ రూపం లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగ నాథన్‌ ముందుంచారు.

దీనిని ప్రజాప్రయోజన వ్యాజ్యం గా పరిగణించిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టిం ది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమే శ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ టి.రజనీల ధర్మాసనం విచారించింది.  విచారణను 29కి వాయిదా వేసింది. అద్దె గర్భం దాల్చిన వారి వివరాలు బయటకు రాకుండా కౌంట ర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ