amp pages | Sakshi

మీ ముందుకు.. ‘గెలుపు పిలుపు’

Published on Sun, 01/05/2020 - 01:41

‘ఎన్ని అడ్డంకులు, అవరోధాలు వచ్చినా తాను ఎంచుకున్న మార్గం నుంచి వైదొలగకుండా ఉంటే గెలుపు సింహాసనం సాక్షాత్కరిస్తుంది. దాన్ని నిజం చేసి చూపిన నేత ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. నిత్యం జనం మధ్య ఉంటూ వారి కష్టసుఖాలు తెలుసుకొని వారి కోసం పాటుపడితే వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అందుకే ఆయన గొప్ప విజయం సాధించారు. ఆయనది జనామోదిత గెలుపు’

‘ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా, ఎలాంటి విపత్కర పరిస్థితులైనా తొణక్కుండా, బెదరకుండా అద్భుత ప్రణాళికలు రచించి అమలు చేసి అద్భుత విజయాలు సొంతం చేసుకోవటం నిరంతర గెలుపు లక్షణం. దానికి నిదర్శనమే తెలంగాణ సీఎం కేసీఆర్‌’ 

‘అవకాశం వచ్చినప్పుడు మనకు మనం విశ్లేషించి ముందుకు సాగితే.. ఎవరికీ తెలియని విషయాలను మనం అందరికీ చెప్పొచ్చు. అందుకే అద్భుత విజయం న్యూటన్‌ వశమైంది’ఇవీ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం రచనల్లో ఉటంకించిన అంశాలు.

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం కలం నుంచి మరో పుస్తకం అందుబాటులోకి వచ్చింది. కీలక బాధ్యతల్లో ఉంటూనే పుస్తక రచనవైపు మళ్లిన ఆయన ఐదు నెలల క్రితం ‘సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌’పేరుతో ఆంగ్లంలో ఓ రచనను జనం ముందుకు తెచ్చారు. అది అమెజాన్‌ ఆన్‌లైన్‌ మార్కెట్‌లో ప్రపంచ రచనలతో పోటీపడి కొన్ని రోజులపాటు తొలిస్థానంలో నిలబడి ఆశ్చర్యపరిచింది. కేవలం ఐదు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 42 వేల కాపీలు అమ్ముడై ఇప్పటికీ ‘అమెజాన్‌’లో టాప్‌ పుస్తకాల్లో ఒకటిగా నిలచి ఉంది. ఇప్పుడు రెండో ప్రయత్నంగా ఆయన ‘గెలుపు పిలుపు’పేరుతో తెలుగులో పలకరించారు. సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌ మూల విషయాన్ని తర్జుమాగా కాకుండా, అదనపు వ్యాఖ్యానాలతో ఈ పుస్తకాన్ని వెలువరించారు.  

విజయం ఎలా వరిస్తుంది, దాన్ని ఎలా నిలుపుకోవాలి, గెలుపు దుష్పరిణామాలు ఏమిటి, దానివల్ల వచ్చే కష్టసుఖాలు, గెలుపు చేయించే తప్పొప్పులు, విజయసూత్రాన్ని ఎలా అనుకూలంగా మలుచుకోవాలి... ఇలాంటి విషయాలను విజయమే వివరిస్తున్నట్టుగా ఈ పుస్తక రచన సాగింది. ఈ అంశాలను కొందరి జీవిత కథలతో ముడిపెట్టి వివరించారు. ఇది కూడా అమెజాన్‌లో పుస్తక ప్రియులను పలకరిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌లో పాఠకుల ముంగిటకు వచ్చిన పుస్తకం ఇప్పుడు విజయవాడలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో పలకరిస్తోంది. వరుసగా నాలుగైదు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం లో ఉన్న బుర్రా వెంకటేశం రెండో రచన ఇది. సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌ బెంగాలీ, స్పానిష్‌ రచనలనూ  బుర్రా వెంకటేశం మార్కెట్‌లోకి తెచ్చారు. త్వర లో మరాఠీ, గుజరాతీ తదితర భాషల్లో రానున్న ట్టు వెల్లడించారు. మరో నెల రోజుల్లో తన మూ డో రచన వెలువరించనున్నట్టు పేర్కొన్నారు.

Videos

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)