amp pages | Sakshi

గజం రూ.7వేలు

Published on Sun, 02/07/2016 - 05:11

 సాక్షి, హన్మకొండ:జాతర సమీస్తుండడంతో మేడారం పరిసర ప్రాంతాల్లో భూముల ధరకు డిమాండ్  పెరిగిపోతోంది. వ్యాపారం, భక్తుల విడిది, వినోద కార్యక్రమాలు.. ఇలా వివిధ పనులతో జాతరకు వచ్చే భక్తులు ఇక్కడ ఇళ్లు, వ్యవసాయ భూములను అద్దెకు తీసుకుంటారు. ఒకేసారి లక్షల మంది భక్తులు వస్తుండటంతో అద్దె ధరలు హైదరాబాద్, వరంగల్‌ను తలదన్నే రీతిలో ఉన్నాయి. మేడారంలో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు  సమ్మక్క-సారలమ్మ మహాజాతర జరగనుం ది. భక్తులు పిల్లాపాపలతో సకుటుంబ సమేతంగా ఈ జాతరకు వస్తారు. వీరంతా మేడారంతో పాటు ఊరట్టం, రెడ్డిగూడెం, నార్లపల్లి, కన్నెపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో విడిది చేస్తారు. చాలా మంది భక్తులు జాతర జరిగే మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి తమ మొక్కులు చెల్లిస్తారు.

జాతరకు వచ్చే భక్తుల బస అవసరాలు తీర్చేందుకు జాతర పరిసర ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లు, పెరటి జాగలతో పాటు తమ పొలాలను సైతం అద్దెకు ఇస్తారు. భక్తుల బస కాకుండా వ్యాపార సముదాయాలకు కూడా జాగా కావాల్సి వస్తుండడంతో అ క్కడి స్థలాలకు క్రేజ్ పెరిగింది. జాతరకు పది హేనురోజుల ముందుగానే  జాగల బుకింగ్‌లు పూర్తి కావచ్చాయి. బుక్కయిన దుకాణాల జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తుండటంతో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. దుకాణాలు, బొమ్మల షాపులు, కోళ్ల అమ్మకాలు చేపట్టేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వ్యాపారులు వస్తారు. వాణి జ్య అవసరాలకు సంబంధించి గజం స్థలానికి అద్దె వేల రూపాల్లో పలుకుతోంది. గద్దెల పరిసర ప్రాంతాల నుంచి జంపన్నవాగు వరకు ఉన్న రెండు కిలోమీటర్ల దారికి ఇరువైపులా ఇప్పటికే దుకాణాలు వెలిశాయి. ఇక గద్దెల చుట్టూ వం ద మీటర్ల వరకు అన్నివైపులా గజం స్థలం విలువ రూ.7వేలు ఉంది.

జంపన్నవాగు దగ్గర గజం స్థలం విలువ రూ.4వేలు ఉండగా ఇప్పటికే అన్ని బుక్ అవడమే కాకుండా వ్యాపారా లు కూడా ప్రారంభమయ్యాయి.  ఊరట్టం వైపు స్నానఘట్టాలు కొత్తగా నిర్మించడంతో ఇక్కడ భూముల అద్దెకు మంచి రేటు వచ్చిం ది. ఈసారి గజం 2,500కు చేరుకుంది.ఇళ్లు.... పదివేలుభక్తులు బస చేస ఇళ్లను, పందిళ్లను ముందుగా నే కిరాయికి బుక్ చేసుకుంటున్నారు. జాతర కేంద్రమైన మేడారం దాని పరిసర గ్రామాలైన రెడ్డిగూడెంలలో ఇళ్ల కిరాయికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీని తర్వాత స్థానంలో కన్నెపల్లి, ఆ తర్వాత నార్లాపూర్, ఊరట్టం గ్రామాలు ఉన్నాయి. జాతర జరిగే మూడు రోజుల పాటు ఒక గదికి అద్దె కనిష్టంగా రూ 3,000 నుంచి 5,000 వరకు పలుకుతున్నాయి. ముఖ్యంగా మేడారం గ్రామంలో ఉన్న ఇళ్ల వరండా అద్దె సగటున ఐదువేల రూపాయలుగా పలుకుతోంది. గదుల అద్దె విషయంలో మేడారంతో రెడ్డిగూడెం పోటీపడుతోంది. ఇక ఊరట్టం, కన్నెపల్లి, నార్లపూర్‌లో ఇందులో సగం ధరలకు గదులు, వరండాలు అందుబాటులో ఉన్నాయి.

 పందిళ్లకూ డిమాండ్
 గతంలో వచ్చే భక్తులు అడవుల్లో ఉండే కంకవనాలను నరికి పందిళ్లు వేసుకుని జాతర జరిగే రోజుల్లో ఇక్కడ బస చేసేవారు. నేటికీ ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు స్థానికులకు చెందిన పెర డు, పొలాల్లో బస ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ మేరకు భక్తులు బసకు సంబంధించి ఒక పందిరికి అద్దె వెరుు్య రూపాయల నుంచి మూ డు వేల రూపాయల వరకు అద్దె పలుకుతోం ది. ముఖ్యంగా జంపన్నవాగు-గద్దెల మధ్య ఉన్న రెడ్డిగూడెం పరిసరాల్లో ఉండే పొలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.

Videos

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)