amp pages | Sakshi

టీఆర్టీ ఫలితాల్లో గందరగోళం

Published on Sun, 06/10/2018 - 00:48

జనగామ అర్బన్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన టీఆర్టీ ఫలితాలు వివిధ జిల్లాల్లోని స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలను చూసిన అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌పై సంబంధం లేని వివరాలు ఉండడంతో కంగుతింటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఎంతోకాలం కష్టపడి పరీక్షకు ప్రిపేర్‌ అయితే టీఎస్‌పీఎస్సీ అధికారులు తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. సాంకేతిక తప్పిదం జరిగిందంటూ అధికారులు నిరుద్యోగులను మరోమారు మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పరీక్ష రాసిన తర్వాత తాము చూసుకున్న ఫైనల్‌ కీ మార్కులకు ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలకు వ్యత్యాసం ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందని వారు వాపోతున్నారు.  

ఫలితాల్లో తప్పులు..
జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఎన్‌.సాయిబాబు బీసీ బీ కులానికి చెందిన పురుషుడు. ఈయనకు ఫైనల్‌ కీలో 58 మార్కులు వచ్చాయి. కాగా, ఫలితాల్లో మాత్రం ఎస్సీ కేటగిరీగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళగా చూపించి 54 మార్కులు ఉన్నట్లు ప్రకటించారు.  
వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన సీహెచ్‌.కల్యాణి బీసీ బీ మహిళ. ఈమెకు బీసీ డీ పురుషుడిగా, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినట్లు ఫలితాల్లో ఉంది.  
మహబూబ్‌నగర్‌కు చెందిన జె.రమేష్‌ బీసీ బీ పురుషుడు. ఈయనను నల్లగొండ జిల్లా బీసీ డీ అభ్యర్థిగా ఫలితాల్లో ప్రకటించారు. ఇదే జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులకు సైతం ఫలితాలు తారుమారు వచ్చాయని ఆందోళన చెందుతున్నారు.  
ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్టీ మహిళ అభ్యర్థి అయితే రంగారెడ్డి జిల్లా బీసీ డీ అని ఉంది.  
మారుతీరెడ్డి కరీంనగర్‌ జిల్లా ఓసీ అభ్యర్థిగా పరీక్షకు హాజరుకాగా, ప్రకటించిన ఫలితాల్లో బీసీ డీ, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన అభ్యర్థిగా ప్రకటించారు.  


నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం
టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన ఫలితాలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. చాలా కాలం పాటు కష్టపడి చదివి పరీక్ష రాస్తే ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ అధికారులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం సరికాదు. ఫలితాలు సైతం పలు అనుమానాలకు తావిస్తున్నాయి.   –నోముల సాయిబాబు, జనగామ జిల్లా

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?