amp pages | Sakshi

ఆర్టీసీకి ప్రభుత్వం ఎక్కువే ఇచ్చింది

Published on Fri, 11/01/2019 - 03:17

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన దానికన్నా ఎక్కువగానే ఆర్టీసీకి చెల్లించిందని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ హైకోర్టుకు నివేదించారు. ఆర్టీసీకి ప్రభుత్వ బకాయిల చెల్లింపులతోపాటు జీహెచ్‌ఎంసీ చేసిన చెల్లింపులపై నివేదిక సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సునీల్‌శర్మ ఈ మేరకు కౌంటర్‌ దాఖలు చేశారు. 2018– 19 సంవత్సరానికి రాయితీ కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన మొత్తం రూ.644.51 కోట్లుకాగా ప్రభుత్వం ఈ మొత్తాన్ని విడుదల చేసిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరంతర మద్దతు లభిస్తున్నప్పటికీ ఆర్టీసీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉందన్నారు. హైదరాబాద్‌ జంట నగరాల్లో బస్సులను తిప్పడం వల్ల వచ్చిన నష్టాల భర్తీకి రూ.1,786.06 కోట్లను తిరిగి చెల్లించాలని జీహెచ్‌ఎంసీని ఆర్టీసీ కోరిందన్నారు. జీహెచ్‌ఎంసీ 2015–16, 2016– 17కు కలిపి రూ. 336.40 కోట్లు మాత్రమే చెల్లించిందన్నారు. ఆర్టీసీ కోరుతున్న మొత్తాలను చెల్లించే పరిస్థితిలో లేమంటూ జీహెచ్‌ఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వంగా పలు తీర్మానాలు పంపిందని వివరించారు. జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి ఆధారంగానే ఎప్పటికప్పుడు చెల్లింపులు ఉంటాయని, వాటిని ఏమాత్రం బకాయిలుగా పరిగణించడానికి వీల్లేదన్నారు. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ఏవిధంగానూ రుణపడి లేదన్నారు.

ఇప్పటిదాకా రూ. 78 కోట్ల ఆర్జన... 
ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలుపెట్టిన 5–10–2019 నుంచి 30–10– 2019 వరకు సంస్థ రూ. 78 కోట్లు ఆర్జించిందని సునీల్‌శర్మ హైకోర్టుకు తెలిపారు.  ఆర్టీసీ సమ్మె గురించి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ కార్యదర్శికి తెలియచేశామని ఆయన హైకోర్టుకు వివరించారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)